ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ చుట్టేస్తున్న కరోనా

ABN, First Publish Date - 2022-08-04T06:06:30+05:30

కరోనా మహమ్మారి మరోసారి జిల్లాను చుట్టేస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తోది. ఫోర్త్‌వేవ్‌లో గడిచిన 40 రోజుల్లోనే 372 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మూడు రోజులుగా 40కిపైగా కేసులు నమోదు అవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 - వేగంగా ఫోర్త్‌ వేవ్‌

- జనంలో నిర్లక్ష్యం 

-  కానరాని మాస్క్‌లు, భౌతిక దూరం 

- జిల్లాలో 9.11 శాతం పాజిటివ్‌ రేటు 

- జిల్లాలో చికిత్స పొందుతున్నవారు 209 మంది 

- విద్యా సంస్థలను తాకిన కొవిడ్‌ 

  (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కరోనా మహమ్మారి మరోసారి జిల్లాను చుట్టేస్తోంది.  చాపకింద నీరులా విస్తరిస్తోది. ఫోర్త్‌వేవ్‌లో గడిచిన 40 రోజుల్లోనే 372 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మూడు రోజులుగా 40కిపైగా  కేసులు నమోదు అవుతున్నాయి.  ఫోర్త్‌వేవ్‌లో ఎల్లారెడ్డిపేటలో కొవిడ్‌ లక్షణాలతో మహిళ మృతిచెందింది.  ప్రస్తుతం జిల్లాలో 209 మంది చికిత్స పొందుతున్నారు. మొదటి,  సెకండ్‌ వేవ్‌ జిల్లా ప్రజలను అతలాకుతలం చేసింది.  థర్డ్‌వేవ్‌ అందరినీ టచ్‌ చేసినా పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. కేసులు తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న క్రమంలో మళ్లీ విజృంభిస్తోంది.  ప్రస్తుతం జిల్లాలో ఫోర్త్‌వేవ్‌లో 9.11 శాతం కరోనా పాజిటివ్‌ రేటు ఉంది.  జిల్లాలో 2020 మార్చిలో మొదలైన కొవిడ్‌ దాదాపు రెండున్నర ఏళ్లుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంది. 7,01,766 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా 36,642 మంది మహమ్మారీ బారిన పడ్డారు. 35,761 మంది కోలుకున్నారు. 672 మంది మృత్యువాత పడ్డారు. మొదటి వేవ్‌లో 13,380 మంది కొవిడ్‌ బారిన పడగా 165 మృతిచెందారు. రెండో వేవ్‌లో 19,040 మందికి పాజిటివ్‌ వచ్చింది. 475 మంది మృతిచెందారు. థర్డ్‌వేవ్‌లో 3850 మంది కొవిడ్‌ బారిన పడగా 32 మంది మరణించారు. ప్రస్తుతం ఫోర్ల్‌వేవ్‌లో 372 మంది కొవిడ్‌ బారిన పడగా ఒకరు మృతిచెందారు. ప్రస్తుతం జిల్లాలో పాజిటివ్‌ రేటు  9.11 శాతంగా ఉంది.  2020 సంవత్సరం ఏప్రిల్‌లో 2.91 శాతం, మే 27.91, జూన్‌ 2.61, జూలై 15.33, ఆగస్టు 27.10, సెప్టెంబరు 20.48, అక్టోబరు 7.88, నవంబరు 4.13, డిసెంబరు 1.63 శాతం ఉంది. 2021 సంవత్సరం జనవరిలో 1.35 శాతం, ఫిబ్రవరి 0.96, మార్చి 1.95, ఏప్రిల్‌ 20.04, మే  30.9, జూన్‌ 1.91, జూలై 1.22, ఆగస్టు 0.73, సెప్టెంబరు 0.32, అక్టోబరు 0.60, నవంబరు 0.10, డిసెంబరు 0.05 శాతంగా ఉంది. 2022 జనవరిలో 9.96 శాతం, ఫిబ్రవరి 3.69, మార్చి 0.05, ఏప్రిల్‌, మే మాసాల్లో కేసులు నమోదు కాలేదు. జూన్‌ 0.05 శాతం, జూలై 12.20 శాతం, ప్రస్తుతం ఆగస్టు 9.11 శాతంతో కొవిడ్‌ రేటు కొనసాగుతోంది.

వెంటాడుతున్న భయం 

ఫోర్త్‌ వేవ్‌లో విద్యా సంస్థల్లోనూ కొవిడ్‌ కేసులు నమోదవుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీంతోపాటు వివిధ శాఖల్లోని ఉద్యోగులు కొవిడ్‌ బారినపడుతున్నారు. జిల్లాలో పాజిటివ్‌ లక్షణాలతో జనం బయట తిరుగుతున్నారు. కొవిడ్‌ దూరమైనట్లుగా భావిస్తున్న క్రమంలో మళ్లీ విజృంభిస్తుండడంతో పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థుల్లోనూ ఆందోళనలు నెలకొన్నాయి.  

పాటించని నిబంధనలు... ఆగని సమావేశాలు 

కరోనా ఫోర్త్‌వేవ్‌ చుట్టేస్తున్నా జిల్లా ప్రజలు కొవిడ్‌ నిబంధనలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం మరిచారు. శుభకార్యాలు, పండుగలు, జాతరలు, యథావిధిగా కొనసాగుతున్నాయి. దీనికితోడు వివిధ పార్టీల సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలకు జనాన్ని సమీకరిస్తున్నారు. భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  దీంతో కొవిడ్‌ మరింత ఆందోళనకు గురవుతున్నారు. 

టీకాలపై నిర్లక్ష్యం

కొవిడ్‌ను కట్టడి చేసిన టీకాపై ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌పై ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో 18 నుంచి 59 సంవత్సరాల వారికి ఫస్ట్‌, సెకండ్‌ డోస్‌ లక్ష్యం 4.22 లక్షలు కాగా 4.31 లక్షల డోసులు పూర్తి చేశారు. 102 శాతంతో ముందు వరుసలో నిలిచారు. 12 నుంచి 14 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి ఫస్ట్‌డోస్‌ 16,749  లక్ష్యానికి 18,278 మందికి, రెండో డోస్‌ 14,189 మందికి వేశారు. 15 నుంచి 17 సంవత్సరాల వరకు ఫస్డ్‌డోస్‌ 27,143 లక్ష్యానికి 28,621 మందికి వేసి 109 శాతం పూర్తి చేశారు.  సెకండ్‌ డోస్‌ 26,440 మందికి వేశారు. బూస్టర్‌ డోస్‌ లక్ష్యం 4.27 లక్షలు కాగా ఇప్పటి వరకు 40 వేల మందికి మాత్రమే పూర్తయ్యింది. ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో టీకా కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. ప్రత్యేక శిబిరాల ద్వారా బూస్టర్‌ డోస్‌ వేయడానికి ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది.  


Updated Date - 2022-08-04T06:06:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising