ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిధులు దోచుకోవడానికే కొనసాగింపు..

ABN, First Publish Date - 2022-04-10T05:57:01+05:30

సింగరేణి నిధులను దోచుకోవడానికే శ్రీధర్‌ను సీఎండీగా ఏడు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీ తారామయ్య అన్నారు.

గేట్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న సీతారామయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య

గోదావరిఖని, ఏప్రి ల్‌ 9: సింగరేణి నిధులను దోచుకోవడానికే శ్రీధర్‌ను సీఎండీగా ఏడు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీ తారామయ్య అన్నారు. శనివారం ఆర్‌జీ-1 పరిధిలో జీడీకే2, ఏరియా వర్క్‌షాప్‌లో జరిగిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ సింగరేణి చరిత్రలో ఏ ఒక్క సీఎండీ కూడా మూడు నాలుగు సంవత్సరాలు కొనసాగలేదని, కానీ ప్రస్తుత సీఎండీ శ్రీధర్‌ ఏడు సంవత్సరాలుగా సీఎండీగా కొనసాగుతూ కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి లాభాలు తీసుకువస్తే వాటిని కార్మిక సంక్షేమ కోసం ఖర్చు చేయకుండా ప్రభుత్వానికి కోట్ల రూపాయలు మళ్లిస్తున్నాడన్నారు. సింగరేణి యాజమాన్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చట్ట ప్రకారం వివిధ పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నా సింగరేణికి రావాల్సిన వేల కోట్ల బకాయిలను చెల్లించడం లేదని, సింగరేణికి బకాయిపడిన కోట్ల రూపాయాల ను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులను నియమిస్తున్న యాజమాన్యం కాంట్రాక్టుగా అధికారులను ఎందుకు నియమించడం లేదని ఆయన ప్రశ్నించారు. సింగరేణిలో 1.15లక్షల మంది కార్మికులు ఉన్న సమయంలో 2450మంది అధికారులు ఉండగా, ఇప్పుడు కార్మికులు 42వేలకు తగ్గారని, అధికారుల సంఖ్య మాత్రం తగ్గడం లేదన్నారు. సింగరేణిలో హెల్త్‌ కార్డులు ఉన్నా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పదవీవిరమణ పొందిన కార్మికులకు వైద్య సేవలను నిలిపివేశారని, తక్షణమే వైద్య సేవలు అందించాల ని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మడ్డి ఎల్లాగౌడ్‌, రంగు శ్రీనివాస్‌, బుర్ర భాస్కర్‌, చెప్యాల మహేందర్‌, రామస్వామి, రవి, శ్రీరాములు, మిట్ట శంకర్‌, కనకరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-10T05:57:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising