ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరపాలి

ABN, First Publish Date - 2022-05-24T05:50:34+05:30

సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసి రెండేళ్లు అవుతున్నా ఎన్నికలు జరుపకుండా యాజమాన్యం జా ప్యం చేస్తోందని, అన్ని కార్మిక సంఘాలతో యాజమాన్యం సంప్రదింపులు జరుపాలని జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి.

సమావేశంలో పాల్గొన్న జాతీయ సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 27న సీఎండీని కలుస్తాం.. జాతీయ కార్మిక సంఘాల నాయకుల వెల్లడి

గోదావరిఖని, మే 23: సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసి రెండేళ్లు అవుతున్నా ఎన్నికలు జరుపకుండా యాజమాన్యం జా ప్యం చేస్తోందని, అన్ని కార్మిక సంఘాలతో యాజమాన్యం సంప్రదింపులు జరుపాలని జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. సోమవారం స్థానిక సింగరేణి బీ గెస్ట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సాంగరేణిలో వెంటనే ఎన్నికలు జరపాలన్నారు. కేవలం టీబీజీకేఎస్‌తో చర్చలు జరపడం సరైంది కాదని, మిగతా సంఘాలతో కూడా ఎన్నికలు జరిపేంత వరకు చర్చలు జరుపాలని డిమాండ్‌ చేశా రు. సేఫ్టీ, మైనింగ్‌ కమిటీ సమావేశాలకు ఆహ్వానించాలని, ఆర్‌ఎల్‌సీ వద్ద రాతపూర్వకంగా సింగరేణి యాజమాన్యానికి తెలిపినప్పటికీ ఆర్‌ ఎల్‌సీ మాటలను కూడా బేఖతరు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజు గనులపై, ఓసీపీలపై 10నుంచి20మంది టీబీజీకేఎస్‌ నాయకులకు ఉచిత మస్టర్లు ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కలిసి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగకుండా అడ్డుకుంటున్నారన్నారు. సింగరేణిలో ఉచిత మస్టర్లను నిలిపివేయాలని, మైన్‌, సేఫ్టీ సమావేశాలకు అన్నీ కార్మిక సంఘాలను ఆహ్వానించాలని ఈనెల 27 సీఎండీని కలిసి వినతిపత్రం ఇవ్వాలని నాయకులు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామ య్య, వైవీవారావు, ఐఎన్‌టీయూసీ నాయకులు గుమ్మడి కుమారస్వామి, ధర్మపురి, హెచ్‌ఎంఎస్‌ నాయకులు రియాజ్‌ అహ్మద్‌, దావ రమేష్‌, సీ ఐటీయూ నాయకులు తుమ్మల రాజిరెడ్డి,నరహరిరావు, బీఎంఎస్‌ నాయకులు యాదగిరి సత్తయ్య, పేరం రమేష్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-24T05:50:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising