ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిపక్షాలను వేధించేందుకు కుట్ర

ABN, First Publish Date - 2022-09-09T05:11:03+05:30

దేశంలో ప్రతిపక్షాలను వేధించేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడా యాత్రకు సంఘీభావంగా గురువారం సిరిసిల్ల అంబేద్కర్‌ చౌరస్తా వద్ద పట్టణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాదయాత్రను ప్రారంభించారు.

సిరిసిల్లలో పాదయాత్ర చేస్తున్న పొన్నం, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌

 సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 8: దేశంలో ప్రతిపక్షాలను వేధించేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడా యాత్రకు సంఘీభావంగా గురువారం సిరిసిల్ల అంబేద్కర్‌ చౌరస్తా వద్ద పట్టణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రతీ వ్యవస్థపైనా దాడి చేస్తోందన్నారు.  ఆ శక్తులను తరిమికొట్టడానికి భారత దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకు రాహుల్‌గాంధీ భారత్‌  జోడా యాత్రను ప్రారంభించారన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ శ్రీనగర్‌ వరకు చేపట్టిన యాత్రకు కాంగ్రెస్‌ శ్రేణులు వెన్నంటి  ఉంటాయన్నారు.  దేశంలోనూ, రాష్ట్రంలో నూ  ప్రతి పక్షాలను వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు.   కార్యక్రమంలో  కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి వెంగళ అశోక్‌, కార్యదర్శి కాసర్ల రాజు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-09T05:11:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising