ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనుగోలు కేంద్రంలో రైతుల ఆందోళన

ABN, First Publish Date - 2022-05-18T06:19:48+05:30

కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు లారీలు రావడం లేదని, వర్షాలు వస్తే నష్టపోతామని జిల్లాలోని పెద్దూర్‌ కొనుగోలు కేంద్రంలో రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు.

రాస్తారోకో చేస్తున్న బీజేపీ నాయకులు, రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల రూరల్‌, మే 17: కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు లారీలు రావడం లేదని, వర్షాలు వస్తే నష్టపోతామని జిల్లాలోని పెద్దూర్‌ కొనుగోలు కేంద్రంలో రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడవకుండా కాపాడుకున్నామని,  ధాన్యం తూకం వేసినా అధికారులు లారీలు పంపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పంపించిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవడం లేదని మండిపడ్డారు. అనంతరం వ్యవసాయాధికారి తిరుపతి రైతుల వద్దకు వచ్చి సమస్యను తెలుసుకున్నారు.  రైస్‌మిల్లర్లతో మాట్లాడి లారీలను తెప్పించారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించడంతో రైతులు శాంతించారు.

కొనుగోలు కేంద్రాల తనిఖీ  

సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, పెద్దబోనాల, చిన్నబోనాల, పెద్దూర్‌, సర్ధాపూర్‌లో సింగిల్‌ విం డోలు, మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ పరిశీలించారు. ధాన్యాన్ని సక్రమంగా తూకం వేయాలని సూచిం చారు.  ఆయన వెంట రెవెన్యూ అధికారులు ఉన్నారు. 

 బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో 

కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లుకు పంపిస్తే మిల్లర్లు తీసుకోకుండా నిరాకరిస్తున్నారని మరోవైపు అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పెద్దూర్‌ సింగిల్‌ విండో చైర్మన్‌, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం వెంకటలక్ష్మీ ఆధ్వర్యంలో రైతులు సిరిసిల్ల - కామారెడ్డి ప్రధాన రహదారిపై మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. వాహనాలు నిలిచిపోవడంతో టౌన్‌ సీఐ అనిల్‌కుమార్‌  బీజేపీ నాయకులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు.  అనంతరం బర్కం వెంకటలక్ష్మి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి 20 రోజులు గడుస్తున్నా  ధాన్యాన్ని తీసుకవెళ్లేందుకు లారీలు రావడం లేదన్నారు. ప్రైవేటు వాహనాల్లో రైస్‌మిల్లులకు తీసుకవెళ్తే మిల్లర్లు అన్‌లోడ్‌ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు కొనుగోలు కేంద్రంలో ఉన్న ఽధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు అన్నల్‌దాస్‌ వేణు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యుడు బర్కం నవీన్‌యాదవ్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ భూక్య కిషన్‌నాయక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T06:19:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising