ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేతనాలు చెల్లించాలని వైద్యుల ఆందోళన

ABN, First Publish Date - 2022-06-30T05:41:54+05:30

వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఎదుట సినియర్‌ రెసిడెంట్‌ వైద్యులు బుధవారం ఆందోళన నిర్వహించారు.

జగిత్యాలలో ప్ల కార్డులు చేతపట్టుకుని నిరసన తెలుపుతున్న వైద్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల టౌన్‌, జూన్‌ 29 : వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఎదుట సినియర్‌ రెసిడెంట్‌ వైద్యులు బుధవారం ఆందోళన నిర్వహించారు. జీవితం సాగాలంటే జీతం కావాలని కోరుతూ వైద్యులు ఫ్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. జిల్లాకు ప్రభుత్వం మెడికల్‌ కళాశాలతో పాటు మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని మంజూరు చేయడంతో పాటు సుమారు 25 మందికి పైగా సీనియర్‌ రెసి డెంట్‌ వైద్యులను నియమించింది. నాలుగు నెలలుగా వైద్యులకు ప్రభు త్వం వేతనాలు చెల్లించకపోవడంతో పలుమార్లు కళాశాల ప్రిన్సిపాల్‌ శివ రాం ప్రసాద్‌తో పాటు సూపరింటెండెంట్‌ రాములు దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ వేతనాలు విడుదల కాలేదు. దీంతో బుధవారం వైద్యులు కళాశాల ఎదుట నిరసన ప్రధర్శన నిర్వహించారు. అనంతరం వారు మా ట్లాడుతూ సరైన సమయంలో వేతనాలు అందక వేదన పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే వేతనాలు విడుదల చే యాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-06-30T05:41:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising