ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోళ్లవాగు రైతుల్లో ఆందోళన

ABN, First Publish Date - 2022-07-18T06:38:52+05:30

భారీ వర్షాలకు రోళ్లవాగు పాత కట్ట తెగి పొలాల్లో ఇసుకమేటలు వేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బీర్‌పూర్‌ మండలంలోని రోళ్లవాగులోకి ఒకే సారిగా భారీగా వరద వచ్చి చేరడంతో ఈ నెల 13న ప్రాజెక్టు పాత కట్ట తెగి పోయింది.

రోళ్లవాగు తెగి పొలాల్లో వేసిన ఇసుక మేటలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- భారీ వర్షాలకు తెగిన కట్ట

 - పొలాల్లో ఇసుక మేటలు

బీర్‌పూర్‌,జులై 17: భారీ వర్షాలకు రోళ్లవాగు పాత కట్ట తెగి పొలాల్లో ఇసుకమేటలు వేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బీర్‌పూర్‌ మండలంలోని రోళ్లవాగులోకి ఒకే సారిగా భారీగా వరద వచ్చి చేరడంతో ఈ నెల 13న ప్రాజెక్టు పాత కట్ట తెగి పోయింది. కట్ట దిగువన ఉన్న   చెర్లపెల్లి, నర్సింహులపల్లి, కండ్లపెల్లి, తాళ్లధర్మారం, చిత్రవేణిగూడెం, తుం గూర్‌, కందెనకుంట గ్రామాలకు చెందిన రైతుల భూములు వ్యవసా యానికి పనికి రాకుండా పోయాయి. రోళ్లవాగు మొదలుకొని గోదావరి ఒడ్డున ఉన్న పొలాల వరకు ఇసుక మేటలు పెట్టడం, వరద దాటికి  పదుల సంఖ్య ఎకరాలలో కయ్యలు కోసి కాలువలుగా మారిపోయాయి. నూతన కట్టకు అమర్చిన బండలు పంట పొలాల్లో చేరి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. భారీ వరద నీరు పంట పొలాలను నామరూపాలు లేకుండా చేసి అరగుండాల ప్రాజెక్టు తెగడానికి కారణం అయింది. ఈ అరగుండాల ప్రాజెక్టు కింద ఉన్న 100 ఎకరాల పంటలు నామరూపాలు లేకుండా పోయాయి.  ప్రాజెక్టులోనికి పైనుంచి వస్తున్న వరద అంచనా వేసి అధికారులు దిగువకు నీరు వదలాల్సి ఉంటుంది. ప్రాజెక్టులోనికి భారీగా నీరు చేరి పాతకట్ట మునిగిపోతున్న విషయం తెలుసుకొని ఎప్పటికప్పుడు పై అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. అధికారులు అప్ర మత్తం అయితే నష్టం జరిగి ఉండేది కాదని రైతులు పేర్కొంటున్నారు.  

Updated Date - 2022-07-18T06:38:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising