ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైస్‌ మిల్లర్ల తరుగుపై కలెక్టర్‌కు ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-01-25T06:00:10+05:30

జగిత్యాల జిల్లాలో రైతుల వద్ద నుంచి సేకరించిన వరిధాన్యంలో నుంచి తీసిన తరుగుకు సంబం ధించిన డబ్బులను వెంటనే ఇప్పించాలని జిల్లా రైతు ఐక్యవేదిక అధ్య క్షుడు పన్నాల తిరుపతి రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఫిర్యాదు చేస్తున్న రైతు ఐక్యవేదిక నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల అగ్రికల్చర్‌, జనవరి 24: జగిత్యాల జిల్లాలో రైతుల వద్ద నుంచి సేకరించిన వరిధాన్యంలో నుంచి తీసిన తరుగుకు సంబం ధించిన డబ్బులను వెంటనే ఇప్పించాలని జిల్లా రైతు ఐక్యవేదిక అధ్య క్షుడు పన్నాల తిరుపతి రెడ్డి డిమాండ్‌ చేశారు. తరుగు డబ్బులు చె ల్లించాలని కోరుతూ కలెక్టర్‌ కార్యాలయ అధికారి నాగార్జున ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ తూకం సమయంలో రైతుల ధాన్యం నుంచి ఒక బస్తాకు 3కిలోలు తరు గు తీశారని, ఆ తరుగు డబ్బులు రైతులకు చెల్లించాలన్నారు. ఇదే విష యాన్ని ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన అధికారులు రైస్‌ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరం అన్నారు. రైతుల శ్రమను దోచుకుంటూ ప్రభుత్వాలు కల్పిం చే మద్దతు ధరను రైతులకు దక్కకుండా మిల్లర్లు దోపీడీకి తెరలేపా రన్నారు. తరుగు డబ్బులు తిరిగి ఇప్పించడంతోపాటు, డిసెంబర్‌ చివరి వారంలో కోనుగోలు చేసిన ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేయాలని తిరుపతి రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య వేదిక బాధ్యులు శేర్‌ నర్సారెడ్డి, కోల నారాయణ రెడ్డి, తీపిరెడ్డి నారాయణ రెడ్డి, మడికుంట గంగారాజం, మోహన్‌రెడ్డి, గంగయ్య, సురకంటి భూమవ్వ  తదితరులున్నారు. 

Updated Date - 2022-01-25T06:00:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising