ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెడికల్‌ కళాశాలలో వసూళ్ల దందా

ABN, First Publish Date - 2022-08-20T05:20:14+05:30

రామగుండం మెడికల్‌ కళాశాలలో కింది స్థాయి పోస్టులు పెట్టిస్తామంటూ కొందరు దళారులు లక్షలు దండుకుంటున్నారు.

గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  స్వీపర్‌ పోస్టుకు రూ.2లక్షలు..

- సెక్యూరిటీ గార్డుకు రూ.2.5లక్షలు..

- డబ్బులు ఇచ్చిన వారే డ్యూటీల్లోకి.. 

- పట్టించుకోని అధికారులు

కళ్యాణ్‌నగర్‌, ఆగస్టు 19: రామగుండం మెడికల్‌ కళాశాలలో కింది స్థాయి పోస్టులు పెట్టిస్తామంటూ కొందరు దళారులు లక్షలు దండుకుంటున్నారు. మెడికల్‌ కళాశాల, అనుబంధ ఆసుపత్రి నిర్వహణకు అప్పగించిన టెండర్‌ ను ఆసరగా చేసుకుని స్వీపర్‌ పోస్టుకు రూ.2లక్షలు, సెక్యూరిటీగార్డు పోస్టు కు రూ.2.5లక్షలు చొప్పున వసూలు చేస్తున్నారు. మెడికల్‌ కళాశాల ఔట్‌ సోర్సింగ్‌ నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువ య్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రామగుండం మెడికల్‌ కళాశాల నిర్వహణకు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) నిధులు మంజూరు చేస్తుంది. దీనిలో భాగంగా పారిశుధ్య నిర్వహణ, పేషెంట్‌ కేర్‌, సెక్యూరిటీ నిర్వహణకు టెండర్లు నిర్వహించారు. డీఎంఈ నిబంధనలతో రూ.2.37 కోట్ల అం చనాలతో ఏడాది కాలపరిమితిపై టెండర్‌ను అప్పగించారు. వీరభద్ర ఇన్‌ఫ్రా సర్వీసెస్‌ హైదరాబాద్‌ సంస్థకు టెండర్‌ దక్కింది. అంచనాలపై 0.01శాతం తక్కువ రేటుకు ఈ సంస్థ టెండర్‌ దాఖలు చేసింది. ఇందులోనే కాంట్రాక్టు బెని ఫిట్‌, కార్మికులకు వేతనాలు, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, శానిటేషన్‌ మెటీరియల్‌, శానిటేషన్‌ కెమికల్స్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కార్మికులకు కనీస వేతనం రూ.15,600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 115మంది సేవలను వినియోగించుకునే అవకాశం ఉండగా, ప్రస్తుతం 42మంది పనిచేస్తు న్నారు. వీరుకాకుండా అదనంగా 73మందిని పనుల్లో పెట్టు కున్నారు. ఇందులో స్వీపర్లు 23, పేషెంట్‌ కేర్‌ 23, సెక్యూరిటీ 27మందిని పనిలో పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. నెలరోజులపై నుంచి కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. టెం డర్‌ తీసుకున్న సంస్థ నుంచి తాము సబ్‌కాంట్రాక్టు తీసుకు న్నామంటూ కొందరు వ్యక్తులు ప్రచారం చేసుకుంటూ ఈ వసూళ్ల దందాకు శ్రీకారం చుట్టారు. మెడికల్‌ కళాశాల ప్రభుత్వాసుపత్రిలో ఇన్నాళ్లు అనధికారికంగా చక్రం తిప్పుతున్న ఇద్దరితో పాటు ఒక ప్రజాప్రతినిధి అనుచరునిగా చెప్పుకుంటున్న మరోవ్యక్తి ఈ దందాలో కీలకంగా వ్యవహ రిస్తున్నట్టు తెలుస్తున్నది. వీరు క్లియరెన్స్‌ ఇస్తేనే కొత్తగా పనుల్లో పెట్టుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాగా, కళాశాల ప్రిన్సిపాల్‌ జోక్యం చేసుకుని ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ నియామకాలు చేపట్టారు. దీంతో ఈ నియామ కాలపై వివాదంపై మొదలైంది. పేరుకు ఇంటర్వ్యూలు నిర్వహించినా దళారులకు డబ్బులు ముట్టజెప్పినవారికే ప్రాధాన్యం ఇచ్చి పనుల్లోకి తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఉపాధి కోసం నాయకులను ఆశ్రయించి వారి సిఫార్సుపై వచ్చే కార్మికులకు కఠినమైన పనులు అప్పగిస్తూ వారంపది రోజుల్లో వారంతట వారే పనిమానేసే విధంగా వ్యవహరి స్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు డబ్బులు చెల్లించిన వారిని పేషెంట్‌ కేర్‌టేకర్లుగా, సెక్యూరిటీ గార్డులు గా నియమిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు సంబంధించి నియామకాల్లో వసూళ్ల దందా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు 50కి పైగా నియామకాలకు సంబంధించి డబ్బులు చేతులు మారినట్టు మెడికల్‌ కళాశాల వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో బోకర్లు, అధికార పార్టీకి చెందిన కొంద రు కార్పొరేటర్ల ప్రమేయం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2022-08-20T05:20:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising