31లోగా సీఎంఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి
ABN, First Publish Date - 2022-08-04T06:10:36+05:30
జిల్లాలో 2020- 2021 యాసంగిలో సేకరించిన ధాన్యానికి సంబంధించి సీఎంఆర్‌ను ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని, 2021 -2022 వానాకాలం సంబంధించి సీఎంఆర్ 36 శాతం మాత్రమే పూర్తయ్యిందని, ధాన్యం మరపట్టడం ప్రారంభించాలని లేని పక్షంలో రైస్‌మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు.
సిరిసిల్ల, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2020- 2021 యాసంగిలో సేకరించిన ధాన్యానికి సంబంధించి సీఎంఆర్‌ను ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని, 2021 -2022 వానాకాలం సంబంధించి సీఎంఆర్ 36 శాతం మాత్రమే పూర్తయ్యిందని, ధాన్యం మరపట్టడం ప్రారంభించాలని లేని పక్షంలో రైస్‌మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లు, వ్యవసాయ విస్తరణ అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖీమ్యానాయక్ మాట్లాడుతూ సీఎంఆర్ బియ్యం రోజు రోజు అందించాలని తహసీల్దార్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు రైస్‌మిల్లర్లతో సమన్వయం చేస్తూ బియ్యం అందించేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో డీసీఎస్‌వో హరికృష్ణ, పౌర సరఫరాల డీటీలు నవీన్‌కుమార్, రవీంద్రచారి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-04T06:10:36+05:30 IST