ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదనపు టీఎంసీతో రైతుల కళ్లలో మట్టి కొడుతున్న సీఎం

ABN, First Publish Date - 2022-01-28T05:20:29+05:30

అదనపు టీఎంసీ కోసం కాలువ నిర్మాణంతో సీఎం కేసీఆర్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

గంగాధర, జనవరి 27: అదనపు టీఎంసీ కోసం కాలువ నిర్మాణంతో సీఎం కేసీఆర్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం గంగాధరలో ఆయన విలేకరలతో మాట్లడుతూ ఇప్పటికే ఉత్తర తెలంగాణ 2టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోదని, మిడ్‌మానేరు, ఎల్‌ఎండీ నీటిని వాడుకునే అవకాశమున్నా పట్టించుకోవడం లేదన్నారు. అదనపు టీఎంసీ అవసరం లేకున్నా కాలువ నిర్మాణానికి సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అదనపు టీఎంసీని పైపులైన్‌, సొరంగ మార్గంలో తరలించాలని, సమాంతర కాలువ తవ్వి రైతుల పొట్ట కొట్టవద్దని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదన్నారు. రైతులు ఆందోళన చేస్తుంటే పోలీసులు ఉక్కుపాదం మోపి అరెస్టులు చేసి అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. కరీంనగర్‌ జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టవద్దని, అదనపు టీఎంసీపై ముఖ్యమంత్రి పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తెలంగాణ రైతుల సమస్యలు పరిష్కరించాలని కేంద్రం సూచించినా పెడచెవిన పెట్టిన రాష్ట్రం, కేంద్ర జలశక్తి, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ అనుమతులు లేకున్నా అదనపు టీఎంసీ కాలువ నిర్మాణానికి సీఎం ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే శోభ, ఎంపీటీసీలు లింగారెడ్డి, గంగాధర భాగ్యలక్ష్మీ నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-28T05:20:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising