ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసరా వెబ్‌సైట్‌ మూసివేత

ABN, First Publish Date - 2022-10-08T05:25:13+05:30

ప్రభుత్వం అందించనున్న ఆస రా పింఛన్‌ పొందడానికి దరఖాస్తులను స్వీకరించడం నిలిపివేయడంతో పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పింఛన్‌లకు అర్హత కలిగిన పలువురి ఆవేదన

- కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నిరాశ

దరఖాస్తుదారులకు తప్పని ఎదురుచూపులు

జగిత్యాల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందించనున్న ఆస రా పింఛన్‌ పొందడానికి దరఖాస్తులను స్వీకరించడం నిలిపివేయడంతో పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు రెండు నెలలుగా ఆ సరా పింఛన్‌ దరఖాస్తులను అధికారులు తీసుకోవడం లేదు. ఆసరా పిం ఛన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌ను అనధికారికంగా ప్రభుత్వం మూసి ఉంచు తోంది. దీంతో నిత్యం వందల సంఖ్యలో దరఖాస్తు దారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇక్కట్లకు గురవుతున్నారు. ఆసరా పథకం కింద వృద్ధాప్య, వితంతే, దివ్యాంగ, గీత, చేనేత, ఒంటరి మహిళలు, బీడీ కార్మికు లు,  ఎయిడ్స్‌ బాధితులు, బోధకాల బాధితులు ఇలా పలు వర్గాలకు చెం దిన వ్యక్తులకు ప్రభుత్వం నెల నెల పింఛన్లను అందజేస్తోంది. సుమారు  రెండు నెలల క్రితం ఆసరా వృద్ధాప్య పింఛన్‌ కింద వయో పరిమితిని 57  ఏళ్లకు సడలించి నూతనంగా పలువురికి ప్రభుత్వం పింఛన్లను జారీ చే సింది. సంబంధిత పింఛన్‌ దారుల వెరిఫికేషన్‌, ఇతర ప్రక్రియ చేపట్టా లన్న సాకుతో కొత్తగా దరఖాస్తులు చేసుకునే వెబ్‌సైట్‌ను ప్రభుత్వం తా త్కాలికంగా మూసివేసింది. దీంతో దరఖాస్తు దారులు నిరాశకు గుర వుతున్నారు.

జిల్లాలో ఆసరా పింఛన్ల పరిస్థితి ఇలా..

జిల్లాలో ప్రస్తుతం 2,02,096 మంది వివిధ కేటగిరిలకు చెందిన వ్యక్తు లకు ప్రభుత్వం ఆసరా పింఛన్లను అందిస్తోంది. ఇందులో వృద్ధాప్య 44, 629, వితంతు 40,166, దివ్యాంగులు 16,331, చేనేత 3,290, గీత కార్మి కు లు 2,092, ఒంటరి మహిళలు 4,421, బీడీ కార్మికులు 88,875, ఎయిడ్స్‌ బాధితులు 577, బోదకాల బాధితులు 1,715 మంది ఉన్నారు. సుమారు గత రెండు నెలల క్రితం కొత్తగా ప్రభుత్వం పలువురికి ఆసరా పింఛన్లను మంజూరు చేసింది. 57 ఏళ్లు నిండిన వ్యక్తులకు సైతం వృద్ధాప్య పింఛన్ల ను అందిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో 19,736 మందికి 57 ఏళ్లు నిండిన వృద్ధుల కేటగిరిలో కొత్తగా మంజూరు ఇచ్చారు. వీరితో పా టు 2,679 వృద్ధాప్య, 5,488 వితంతు, 1,606 దివ్యాంగులు, 519 గీత కా ర్మికులు, 512 చేనేత కార్మికులు, 236 ఒంటరి మహిళలు, 355 బీడీ కార్మి కులు, 219 ఎయిడ్స్‌ బాధితులు, 202 బోదకాల బాధితులకు కొత్తగా పిం ఛన్లను మంజూరు చేసి అందిస్తున్నారు. 

దరఖాస్తుకు ముందుకు వస్తున్నా...

దాదాపుగా నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించుతూ గతంలో ఆసరా పింఛ న్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం రెండు నెలల క్రితం శుభవార్తను అందించింది. దీంతో కొత్తగా దరఖాస్తు చేసుకోవలనుకునే వా రి సంఖ్య గణనీయంగా పెరిగింది. అర్హత ఉండి సకాలంలో దరఖాస్తు చే సుకోని పలువురు తాజాగా ప్రభుత్వానికి ఆర్జీలు పెట్టుకోవడానికి ముం దుకు వస్తున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కాకుండా అర్హత కలిగి ఉండి ఇప్పటివరకు ఆర్జీలు పెట్టుకోకుండా ఉన్న వ్యక్తులు వందల సంఖ్యలో ఉన్నారు. వీరంతా ప్రస్తుతం దరఖాస్తు చేసుకుందామనుకుంటే వెబ్‌సైట్‌లో ఆప్షన్‌ పనిచేయకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. కొత్త గా పింఛన్లను మంజూరు చేసే అవకాశం ముందు ముందు ఉంటుందని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. మీ సేవా కేంద్రాల్లో, సం బంధిత మున్సిపాల్టీలు, మండల పరిషత్‌ కార్యాలయాల్లో, మీ సేవా కేం ద్రాల్లో దరఖాస్తులు ఇవ్వాలని సూచిస్తున్నారు.

వెబ్‌సైట్‌ మూసివేతతో అవస్థలు..

ఆసరా వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఆప్షన్‌ను ప్రభుత్వం ఎటువంటి ప్రకటన లేకుండానే ముసివేసింది. కొత్త దరఖాస్తుల స్వీకరణకు అవకాశం లేకుం డా పోయింది. సుమారు రెండు నెలలుగా దరఖాస్తులను ప్రభుత్వం స్వీక రించడం లేదు. అర్హత ఉన్న వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఆస క్తిని చూపతున్నప్పటికీ వెబ్‌సైట్‌ పనిచేయకపోవడంతో నిరాశకు గురవు తున్నారు. జిల్లాలో వేల సంఖ్యలో దరఖాస్తుదారులున్నట్లు అంచనా ఉం ది. రెండు నెలల క్రితం మంజూరు అయిన పింఛన్‌లను లబ్ధి చేకూర్చ డానికి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తుండడంతో వెబ్‌సైట్‌ను ప్రభుత్వం మూసి ఉంచిందని గతంలో అధికారులు చెప్పారు. కానీ రెండు నెలలు గడిచినప్పటికీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఆప్షన్‌ తెరుచుకోకపోవడంతో కార్యా లయాల చుట్టూ తిరుగుతూ ఇక్కట్ల పాలవుతున్నారు.

దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలి

- అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు 

ప్రభుత్వం ఆసరా పథకం కింద అందిస్తున్న పింఛన్‌ పొందడానికి అర్హులైన వ్యక్తులు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. సంబంధిత వెబ్‌ సైట్‌లో దరఖాస్తు ఆప్షన్‌ను అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం ఆసరా దరఖాస్తులను కనీసం స్వీకరించకపోవడం సమంజసం కాదు. దీంతో కార్యాలయాల్లో దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి.

ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది

- వినోద్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

ఆసరా పింఛన్‌ కింద కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి సంబందిత వెబ్‌సైట్‌లో ఆప్షన్‌ ప్రస్తుతం లేదు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వెబ్‌సైట్‌లో ఆప్షన్‌ ఓపెన్‌ అయిన తదుపరి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా మున్సిపాల్టీలు, మండల పరి షత్‌లలో కాకుండా మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-10-08T05:25:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising