ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెల్లవారితే జన్మదినం.. అంతలోనే మరణం

ABN, First Publish Date - 2022-06-26T06:36:05+05:30

చిట్టిపొట్టి మాటలు.. తప్పటడుగులతో సందడి చేసిన ఆ చిన్నారి చిరునవ్వులు మూగబోయాయి. ఆరుబయట పిల్లలతో ఆడుకుంటున్న చిన్నారిని మురుగునీటి సంపు మింగేసింది.

చిన్నారి మహీ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మురుగునీటి సంపులో పడి చిన్నారి మృతి

 ఎల్లారెడ్డిపేట, జూన్‌ 25: చిట్టిపొట్టి మాటలు.. తప్పటడుగులతో సందడి చేసిన ఆ చిన్నారి చిరునవ్వులు మూగబోయాయి. ఆరుబయట పిల్లలతో ఆడుకుంటున్న చిన్నారిని మురుగునీటి సంపు మింగేసింది. తెల్లారితే జన్మదిన వేడుకలకు సిద్ధమవుతున్న తల్లిదండ్రుల సంతోషాన్ని ఆవిరి చేసింది. కన్నవారికి పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల సముదాయంలో ఇమ్మడిశెట్టి మహి(3) శనివారం ప్రమాదవశాత్తు మురుగు నీటి సంపులో పడి మృతి చెందింది.    పోలీసులు, కుటుంబసభ్యుల కథనం మేరకు.. గ్రామంలోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలో ఇమ్మడిశెట్టి మంజుల- వెంకటేశ్‌ దంపతులు ఇద్దరు పిల్లలు సాహిత, మహీతో కలిసి ఉంటున్నారు. కూలీ పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తున్నారు. ఆరు బయట పిల్లలతో కలిసి ఆడుకుంటున్న చిన్నారి మిహీ  సమీపంలోని మురుగు నీటి సంపుపై మూత లేకపోవడంతో అందులో ప్రమాదవశాత్తు పడిపోయింది. కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, కాలనీవాసులు చుట్టు పక్కల గాలించారు. సమీపంలోని మురుగు నీటి సంపులో  పాప శవమై కనిపించింది. కన్నకూతురు పుట్టిన రోజు వేడుకలను సిద్ధమవుతున్న క్రమంలో చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసెలా రోధించారు. మృతురాలి తండ్రి వెంకటేశ్‌ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై  శేఖర్‌ వివరించారు.

కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతోనే పాప ప్రాణం పోయింది 

గ్రామంలోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల సముదాయంలో మురుగు నీటి సంపు పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ పైకప్పు మూత సరిగా బిగించకపోవడంతోనే పాప ప్రాణం పోయిందని తల్లిదండ్రులు, కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.   సంపును నిర్మించి మూత బిగించకపోవడంతో చిన్నారి మహీ మృతి చెందిందని వాపోయారు. సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2022-06-26T06:36:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising