ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చదువుతో జీవితాల్లో మార్పు

ABN, First Publish Date - 2022-05-28T04:56:23+05:30

జీవితాలను మార్చేశక్తి చదువుకే ఉందని, అలాంటి చదువుపై ఆశ ఉన్న విద్యార్థులను ప్రొత్సహించాలని, ఆర్థిక సహాయం అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు చేయూతను అందించాలని అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ అన్నారు.

ఆర్థిక సహాయం అందిస్తున్న అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల కలెక్టరేట్‌, మే 27: జీవితాలను మార్చేశక్తి చదువుకే ఉందని, అలాంటి చదువుపై ఆశ ఉన్న విద్యార్థులను  ప్రొత్సహించాలని,  ఆర్థిక సహాయం అందించేందుకు స్వచ్ఛంద  సంస్థలు చేయూతను అందించాలని అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని  కార్యాలయంలో శుక్రవారం వీర్నపల్లి మండలం రాశిగుట్ట తండాకు చెందిన మాలోతు స్వర్ణ అనే యువతి అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో ఎంఏ డెవలప్‌మెంట్‌లో సీటు వచ్చింది. తంగళ్లపల్లి గిరిజన గురుకుల కళాశాలలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతోంది. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేకపోవడంతో యూనివర్సిటీ ఫీజు రూ.20 వేలు చెల్లించే స్థోమత లేక బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న సేవాలాల్‌ స్వచ్ఛంద సంస్థ సేవాసమితి సభ్యులు స్పందించి అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ ద్వారా రూ.25 వేల నగదును అందించారు.  కళాశాల ప్రిన్సిపాల్‌ రజని, సేవాలాల్‌ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు భూక్య గజన్‌లాల్‌, భూక్య కళావతిహూజునాయక్‌, అజ్మీరా రవినాయక్‌, భూక్య లింగం నాయక్‌, భానోతు శ్రీనివాస్‌నాయక్‌, గుగులోతు రవిలాల్‌, భానోతు శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T04:56:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising