ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసుల దర్యాప్తులో జాగ్రత్తలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-01-26T06:20:23+05:30

కేసుల దర్యాప్తు విష యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సురేష్‌ అన్నారు. మంళవారం జిల్లా కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు.

పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేస్తున్న ఎస్పీ సురేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎస్పీ సురేష్‌

ఆసిఫాబాద్‌, జనవరి 25: కేసుల దర్యాప్తు విష యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సురేష్‌ అన్నారు. మంళవారం జిల్లా కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిసెప్షన్‌, స్టేషన్‌ రికార్డు రూం, మహిళా సహాయ కేంద్రం, సీసీటీఎన్‌ఎస్‌, రైటర్‌ రూం, కోర్టు మానిటరింగ్‌ ఆఫీసు, జనరల్‌ డైరీ, స్టేషన్‌ పార్కింగ్‌, పరిసరా లను పరిశీలించారు. అనంతరం పోలీసుస్టేషన్‌లో రికార్డులను పరిశీలించి పెండింగ్‌ కేసులు, కేసుల్లో పురోగతి, కేసులను దర్యాప్తు చేసే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. పోలీస్‌ స్టేషన్‌ రికార్డులను ఆన్‌లైన్‌లో పొందు పరుస్తూ 5ఎస్‌ ఇంప్లిమెంట్‌ చేయాలని తెలిపారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే పిటిషన్లు పెండింగ్‌లో లేకుండా తక్ష ణమే పరిష్కరించాలని సూచించారు.  పోలీసు అధి కారులు, సిబ్బంది విధులు నిర్వర్తించే సమయంలో సమయపాలన పాటించాలని, వృత్తి పట్ల నిబద్దత, క్రమశిక్షణ కలిగి ఉండాలని అన్నారు. అలాగే సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడి గి తెలుసుకున్నారు. పోలీసుస్టేషన్‌ పరిధిలో ఎటు వంటి నేరాలు జరగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని దానికి అనుగుణంగా పెట్రోలింగ్‌ నిర్వహించాలన్నారు. ప్రతిరోజు వాహన తనిఖీలు, విజిబుల్‌ పోలీసింగ్‌ చేయాలని, పెట్రోలింగ్‌ చేస్తూ ఉండాలని ఎవరైనా అనుమానస్పదంగా ఉంటే తని ఖీలు నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ అశోక్‌, ఎస్సైలు వెంకటేష్‌, గంగన్న, లావణ్య, రాజేశ్వర్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-01-26T06:20:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising