ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karimnagar: బండి సంజయ్‌పై కేసు నమోదు

ABN, First Publish Date - 2022-01-03T13:52:29+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టూటౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టూటౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం  కలిగించడంపై  బండి సంజయ్ సహా మొత్తం 12 మందిపై కేసులు నమోదు అయ్యాయి. పీటీసీ సెంటర్ దగ్గరకు  భారీగా  బీజేపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం తరువాత బండి సంజయ్‌ను పోలీసులు  పీటీసీ సెంటర్ నుండి కోర్టుకు తీసుకెళ్లనున్నారు.  


ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం సర్కారు జారీ చేసిన జీవో 317ను సవరించాలనే డిమాండ్‌తో జిల్లాలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో బండి సంజయ్‌ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.  కరెంటు సరఫరాను నిలిపివేసి, కిటికీల నుంచి ఫైరింజన్‌తో నీళ్లు చల్లి, ఎంపీ కార్యాలయ ద్వారాన్ని బద్దలు కొట్టి సంజయ్‌ని అరెస్టు చేశారు. దీంతో ఎంపీ క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలొకన్న విషయం తెలిసిందే. 


మరోవైపు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా నేడు అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బీజేపీ దీక్షలు చేపట్టనుంది. ఉదయం 11గంల‌ నుంచి సాయంత్రం 5గంల వరకు   జిల్లా, మండల అధ్యక్షులు నిరసన దీక్ష చేయనున్నారు. కోవిడ్ నిబంధనల మేరకు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేయాలని రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2022-01-03T13:52:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising