ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకే భరోసా యాత్ర

ABN, First Publish Date - 2022-12-07T00:23:27+05:30

ఎనిమిదిన్నర సంవత్సరాల టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర చేపడుతున్నట్టు బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తెలిపారు.

బైక్‌ ర్యాలీలో బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తంగళ్లపల్లి, డిసెంబరు 6: ఎనిమిదిన్నర సంవత్సరాల టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర చేపడుతున్నట్టు బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. మండల కేంద్రంలో బైక్‌ ర్యాలీని లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో భూకబ్జాలు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రి హరీష్‌రావు కేంద్ర ప్రభుత్వం చేనేతపై 5 శాతం జీఎస్టీ విధిస్తుందని విమర్శిస్తున్నారే తప్ప జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో జీఎస్టీ తగ్గింపుపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూ రి రమాకాంతారావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, బీజేపీ మండల అధ్యక్షుడు సురువు వెంకట్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు, ఎంపీటీసీ రాగుల రాజిరెడ్డి, చిన్న లింగాపూర్‌ ఎంపీటీసీ బైరినేని రాము , బీజేవైఎం మండల అధ్యక్షుడు కోల ఆంజనేయులు గౌడ్‌, బీజేపీ నాయకులు వెన్నమనేని శ్రీధర్‌రావు, గజభీంకార్‌ సంతోష్‌, బూర విష్ణు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:23:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising