ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజన్న క్షేత్రంలో భక్తజన సందోహం

ABN, First Publish Date - 2022-08-09T05:47:48+05:30

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తజనంతో కిటకిటలాడింది.

స్వామివారి దర్శనానికి క్యూలైన్‌లో వేచిఉన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- స్వామిదర్శనం కోసం బారులు

వేములవాడ, ఆగస్టు 8: వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తజనంతో కిటకిటలాడింది. శ్రావణమాసం రెండో సోమవారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 వేలకు పైగా భక్తులు వేములవాడకు తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు తొలుత ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన అనంతరం ధర్మదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుని తరించారు. సోమవారం సందర్భంగా లఘు దర్శనం అమలు చేస్తుండడంతో భక్తులు నందీశ్వరుడి విగ్రహం వ్దద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు.  కోడెమొక్కు చెల్లించుకోవడంతో పాటు స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం తదితర ఆర్జిత సేవలలో భక్తులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనం కోసం రెండు గంటలకు పైగా సమయం పట్టగా, కోడెమొక్కు చెల్లింపు కోసం మూడు గంటల సమయం పట్టింది. రోజంతా పలుమార్లు వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. 


Updated Date - 2022-08-09T05:47:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising