ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీడీ కార్మికులకు జీవనభృతి అందించాలి

ABN, First Publish Date - 2022-09-27T05:58:24+05:30

బీడీ కార్మికులతోపాటు ప్యాకర్లు, బట్టిచటన్‌, నెలసరి ఉద్యోగులు, టేకేదారులకు రాష్ట్ర ప్రభుత్వం జీవన భృతిని అందించాలని తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు, రాష్ట్రప్రధాన కార్యదర్శి ముద్రకోల అంజనేయులు డిమాండ్‌ చేశారు.

ధర్నా చేస్తున్న కార్మికులు నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల కలెక్టరేట్‌, సెప్టెంబరు 25 : బీడీ కార్మికులతోపాటు ప్యాకర్లు, బట్టిచటన్‌, నెలసరి ఉద్యోగులు, టేకేదారులకు రాష్ట్ర ప్రభుత్వం జీవన భృతిని అందించాలని తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు, రాష్ట్రప్రధాన కార్యదర్శి ముద్రకోల అంజనేయులు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట సోమవారం బీఎల్‌ టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి నాయకులు ధర్నా చేశారు.  2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఅర్‌  ప్రకటించిన రూ. 2016ను జీవన భృతిని షరుతులు లేకుండా అందించాలని కోరారు. బీడీ పరిశ్రమలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేయాలన్నారు. అంతకుముందు  కలెక్టర్‌ను కలిసేందుకు కార్మికులు వెళ్తుండగా  సిరిసిల్ల ఎస్‌ఐ చీనానాయక్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐ రాజు అడ్డుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌ ఏవో గంగయ్యకు వినతి పత్రాన్ని అందించారు.  బీఎల్‌టీయూ కామారెడ్డి జిల్లా కన్వీనర్‌ కమ్మరి సదానందం, వడ్ల సాయికృష్ణ, ఎస్‌.స్వామి, కడవేర్గు శ్రీహరి,  నర్సింహులు, గుడ్ల రాజు, ప్రసాద్‌, బాలకృష్ణ, చింతల రాజు, కృష్ణ, సిద్దిరాములు, ప్రభు, వెంకటేశం, శ్రీనివాస్‌, రాజీత, మంజుల, బాలలక్ష్మీ, అనిత, స్వప్న, లావణ్య, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-27T05:58:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising