ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

ABN, First Publish Date - 2022-08-27T06:12:51+05:30

విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అడిషనల్‌ డీజీపీ వై నాగిరెడ్డి అన్నారు. ఎ

ఒకటవ టాణాలో రికార్డులను తనిఖీ చేస్తున్న అడిషనల్‌ డీజీపీ వై నాగిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అడిషనల్‌ డీజీపీ వై నాగిరెడ్డి

కరీంనగర్‌ క్రైం, ఆగస్టు 26: విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అడిషనల్‌ డీజీపీ వై నాగిరెడ్డి అన్నారు. ఎలాంటి సవాళ్లనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా ఉండాలని చెప్పారు. శుక్రవారం నగరంలోని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. అడిషనల్‌ డీసీపీ(ఎల్‌అండ్‌ఓ) ఎస్‌ శ్రీనివాస్‌, ఏసీపీ తుల శ్రీనివాస్‌రావు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. తొలుత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులను తనిఖీ చేయడంతో పాటు పోలీస్‌స్టేషన్‌ ఆవరణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అన్నారు. వివిధ రకాల ఆందోళనల సందర్భంగా పరిసర ప్రాంతాలను గమనించా లని చెప్పారు. అకస్మాత్తుగా దాడులు జరిగిన సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో అడిగి తెలుసుకున్నారు. వివిధ రకాల పనివిభాగాల గురించి అడిగారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.  కార్యక్రమంలో పోలీసు కమిషనర్‌ వి సత్యనారాయణ, అడిషనల్‌ డీసీపీ(ఎల్‌అండ్‌ఓ) ఎస్‌ శ్రీనివాస్‌, ఏసీపీ తుల శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్‌ నటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-27T06:12:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising