ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెవెన్యూ సదస్సులకు సన్నద్ధంగా ఉండాలి

ABN, First Publish Date - 2022-07-07T06:47:47+05:30

జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహ ణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అధికారులను ఆదేశించారు

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల, జూలై 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహ ణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని కలెక్టరేట్‌ కార్యాల యంలో భూసేకరణ, ధరణి తదితర అంశాలపై జిల్లాలోని రెవెన్యూ డివిజన్‌ అధికారులు, పలువురు రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 15వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని తెలిపారు. ప్రతి మండల కేంద్రంగా మూడు రోజుల పాటు సదస్సు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రతి మండలంలో ఇప్పటివరకు అందించిన దరఖాస్తుల మేరకు భూ సమస్యలపై తహసీ ల్దార్లు సంపూర్ణ నివేదిక తయారు చేసి సమర్పించాలన్నారు. జిల్లాలోని జగిత్యాల రూరల్‌, జగిత్యాల అర్బన్‌, మల్యాల, కొడిమ్యాల మండలాల్లో జాతీయ రహదారి నిర్మాణానికి సంబందించిన భూ సర్వే ప్రక్రియ దాదాపుగా 50 శాతం ముగిసిందని, పెండింగ్‌ భూ సర్వే ప్రక్రియను రానున్న వారం రోజుల్లో పూర్తయ్యే విధంగా వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల ఆర్డీఓ మాధురి, జిల్లాలోని పలు మండలాల తహసీల్దార్లు, జాతీయ రహదారి కో ఆర్డినేటర్‌ పాల్గొన్నారు.

దళితబంధు సద్వినియోగం చేసుకోవాలి

మల్యాల: దళితబంధు పథకంను సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్‌ జి.రవి లబ్ధిదారులకు సూచించారు. మండలంలోని గొర్రెగుండం గ్రామ లబ్ధిదారులు గొర్రెగుండం, రామన్నపేట గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్న దళితబంధు యూనిట్లను కలెక్టర్‌  పరిశీలించారు. రామన్నపేటలో ఏర్పాటు చేసిన సూపర్‌మార్కెట్‌, గొర్రె గుండంలో డెయిరీ, గొర్రెల షెడ్ల యూనిట్‌ పరిశీలించారు. మొబైల్‌ టిఫిన్‌ లబ్ధిదారునికి వ్యాను అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ లక్ష్మీనారాయణ, ఆర్డీవో మాధురి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి మనోహర్‌, ఎంపీపీ మిట్టపెల్లి విమల సర్పంచ్‌లు సుంకె లచ్చయ్య, మిట్టపెల్లి సుదర్శన్‌, రాసమల్ల హరీశ్‌, ఎంపీడీవో శైలజారాణీ, మండల పశువైద్యాధికారి రాజ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2022-07-07T06:47:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising