విద్యార్థులకు అందుబాటులో ఉంటాం
ABN, First Publish Date - 2022-12-16T01:09:10+05:30
విద్యార్థుల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. గురువారం సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కల్యాణమండపంలో స్కూల్ సేఫ్టీ అనే అంశంపై అవగాహన సదస్సును ప్రారంభించారు.
- ఎస్పీ రాహుల్ హెగ్డే
సిరిసిల్ల క్రైం, డిసెంబరు 15: విద్యార్థుల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. గురువారం సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కల్యాణమండపంలో స్కూల్ సేఫ్టీ అనే అంశంపై అవగాహన సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ఉపాధ్యాయులు సంకల్పించాలన్నారు. విద్యార్థులు సామాజిక సృహ పెంచుకోవాలన్నారు. పాఠశాలల్లో స్కూల్ కంప్లెయింట్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పిల్లల హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులతో చెప్పుకోలేని విషయాలు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు చెప్పుకుంటారన్నారు. విద్యార్థులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతీ ఒక్కరి బాధ్యతన్నారు. పోక్సో చట్టాల కింద స్కూల్ అథారిటీ రోల్ చాలా ప్రధానమైందన్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావం పిల్లలపై రోజు రోజుకు మితిమీరుతోందన్నారు. ఆధునిక ప్రపంచంలో సామాజిక మాధ్యమాల అవసరం ఉన్నప్పటికీ వాటి వినియోగంలో పరిపక్వతను, విజ్ఞతను విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆపద ఎదురైతే పరిష్కరించుకోవడంపై అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని, బాధితులకు భరోసా ఇస్తారని అన్నారు. పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల సమస్యలు తెలియజేయడానికి ఫిర్యాదుల బాక్స్‌లు ఏర్పాటు చేయాలన్నారు. షీటీమ్ బృందం ద్వారా ‘గుడ్ టచ్ బాడ్ టచ్’పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తు న్నామన్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయు లేనన్నారు. డీఈవో రాధాకిషన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు విద్యార్థుల చట్టాలపై అవగాహన కల్పించడం మంచి పరిణామమన్నారు. దివ్య, దిశ డైరెక్టర్ పిలిప్స్ మాట్లాడుతూ లైంగిక వేధింపులు ఏ విధంగా ఉంటాయో పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనా, ఉపాధ్యాయులపైనా ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, సిరిసిల్ల టౌన్ సీఐ అనిల్‌కుమార్, రూరల్ సీఐ ఉపేందర్, వేములవాడ టౌన్ సీఐ వెంకటేశ్, ఎస్సైలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T01:09:17+05:30 IST