ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల్లో హాజరుశాతం పెంచాలి

ABN, First Publish Date - 2022-12-16T00:57:15+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచాలని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను, కిష్టంపేటలోని ఉన్నత పాఠశాలను పరిశీలిం చారు. పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నాయని సంబంధిత ప్రధానో పాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అభ్యసన సామర్థ్యాలను పెంపొందిం చేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు.

తరగతి గదిలో విద్యార్థుల సామర్ధ్యాలను తెలుసుకుంటున్న శ్రీదేవసేన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాల్వశ్రీరాంపూర్‌, డిసెంబరు 15: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచాలని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను, కిష్టంపేటలోని ఉన్నత పాఠశాలను పరిశీలిం చారు. పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నాయని సంబంధిత ప్రధానో పాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అభ్యసన సామర్థ్యాలను పెంపొందిం చేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. పాఠశాలకు వచ్చిన విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేనకు ఎంపీపీ నూనేటి సంపత్‌, సర్పంచ్‌ ఆడెపు శ్రీదేవిరాజు శాలువాలతో సన్మానించారు. మండలంలోని పలు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఎంపీపీ సంపత్‌ శ్రీదేవసేకు వినతి పత్రం అందజేశారు. అనంతరం కాల్వ శ్రీరాంపూర్‌, కిష్టపేలో ‘మన ఊరు, మన బడి’ కార్యక్రమంలో నిర్మించిన తరగతి గదులును, డైనింగ్‌ హాల్‌, టాయిలెట్స్‌, కిచెన్‌ పనులను పరిశీలించారు. పాఠశాలల్లో వేసిన రంగులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాల్వ శ్రీరాంపూర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఆయా తరగతుల విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును పరిశీలించారు. చిన్నారులను పలు ప్రశ్నలు వేస్తూ వారి బోధనా సామర్థ్యాన్ని అంచనా వేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తున్న విధానాన్ని తరగతిలో కూర్చుని పరిశీలించారు. ఉపాధ్యాయులు లెసన్‌ ప్లాన్‌ తయారు చేసుకుని విద్యార్థులకు బోధించాలన్నారు. చదువులో వెనుకంజలో ఉన్న వారిపై మరింత శ్రద్ధ చూపాల న్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ రమేస్‌, జిల్లా విద్యాధికారి మాధవి, ఎంపీడీఓ రాంమోహనచారి, ఎంఈఓ రాజయ్య, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.

Updated Date - 2022-12-16T00:58:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising