ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశ్నించే గొంతుకలపై దాడులు

ABN, First Publish Date - 2022-12-15T00:49:08+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించే గొంతుకలపైన దాడులు చేస్తున్నాయని, దీన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌ అన్నారు.

సిరిసిల్లలో ధర్నా చేస్తున్న జిల్లా కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 14: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించే గొంతుకలపైన దాడులు చేస్తున్నాయని, దీన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోల్‌ కార్యాలయంపై తెలంగాణ పోలీసుల దాడికి నిరసనగా బుధవారం పట్టణంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడారు. సునీల్‌ వ్యూహాలతో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలను, తీరును కాంగ్రెస్‌ పార్టీ ప్రజల వద్దకు తీసుకెళ్తోందని, ఈ క్రమంలో 2023 ఎన్నికలో గెలవలేమని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కార్యాలయాన్ని సీజ్‌ చేయడాన్ని తప్పుపడుతున్నామన్నారు. ప్రజాస్వామిక వాదులు ఈ దాడులను ఖండించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని రాజ్యం ఏలుతోందని ఆరోపించారు. ప్రజాదరణ పొందుతున్న సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐపై విచారణలతో బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలను గద్దెదించే వరకు కాంగ్రెస్‌ శ్రేణులు పోరాటం చేయాలన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టి బొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించిన కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, కాంగ్రెస్‌ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. చివరికి పోలీసులు దిష్టిబొమ్మను స్వాదీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కుమార్‌, సిరిసిల్ల, వేములవాడ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్‌, వెంకటస్వామి, సిరిసిల్ల పట్టణ ప్రధాన కార్యదర్శి వెంగళ అశోక్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, జిల్లా నాయకులు జగన్మోహన్‌రెడ్డి, సిరోజ్‌పాషా, పిల్లి కనకయ్య, శ్రీనివాస్‌, రామస్వామి, ప్రదీప్‌, దేవస్వామి, గణేష్‌, ప్రభాకర్‌, గొట్టె రుక్మిణి, గోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:49:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising