ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-01-20T05:05:15+05:30

జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులు కొవిడ్‌ కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌
జగిత్యాల (ఆంద్రజ్యోతి), జనవరి 19:  జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులు కొవిడ్‌ కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు.  కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం పెద్దపల్లి, జగిత్యాల జిల్లా కలెక్టర్లు రవి, డాక్టర్‌ సంగీత సత్యనారాయణలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌, కొవిడ్‌ కట్టడిపై తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. క్యాబినెట్‌ సమావేశంలో ముఖ్యమంత్రి జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయ్యాలని అధికారులు సూచించానట్లు తెలిపారు.   వ్యాక్సినేషన్‌ అంశంపై జిల్లాలో టాస్క్‌ పోర్స్‌ అధికారుల టీమ్‌ను ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు. జిల్లాలోని ధర్మపురి, మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో తక్కువ శాతం వ్యాక్సినేషన్‌ నమోదు అయిందని చెప్పారు. వీటిపై వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ  తీసుకోని పూర్తి చేయ్యాలని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమైక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి అధికంగా  ఉందన్నారు. మన జిల్లాలో ఒమైక్రాన్‌ ప్రబలకుండా జాగత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రవి మాట్లాడుతూ 7,58,757 జనాభా లక్ష్యానికి గాను మొదటి డోస్‌ 100 శాతం పూర్తయిందన్నారు. రెండో డోస్‌ 75 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో 51,979 మందికి రెండో డోస్‌ వేయ్యవలసి ఉందన్నారు.  సంక్రాంతి పండుగ నేపథ్యంలో తక్కువ శాతం నమోదు అయిందని పూర్తి స్థాయిలో వ్యాక్సినైజేషన్‌ అధికారు లు, ప్రజాప్రతినిదులు కలిసి పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ దామ వసంత, చొప్పదండి, జగిత్యాల ఎమ్మెల్యేలు  రవిశంకర్‌, సంజయ్‌కుమార్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T05:05:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising