ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN, First Publish Date - 2022-05-26T05:51:15+05:30

జిల్లాలో ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 31న ప్రారంభం అవుతున్న దృష్ట్యా పరీక్షల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ అధికా రులను ఆదేశించారు.

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

-  అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ 

సిరిసిల్ల, మే 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 31న ప్రారంభం అవుతున్న దృష్ట్యా పరీక్షల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ అధికా రులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో సం బంధిత అధికారులతో ఏర్పాట్లపై హైపవర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఖీమ్యానాయక్‌ మాట్లాడుతూ ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 31 నుంచి జూన్‌ 25 వరకు జరగనున్నాయని ఇందుకోసం జిల్లా కేంద్రంలో టెన్త్‌ పరీక్షలకు రెండు కేంద్రాలు, ఇంటర్‌ పరీక్షలకు నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆర్టీసీ సంస్థ బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. అవసరం అయితే అదనపు బస్సులు నడపాలని కోరారు. ఉదయం 8. 30 గంటల నుంచి 11.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఈవో రాధాకిషన్‌, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి మోహన్‌, పరీక్షల విభాగం సహాయ కమిషనర్‌ అబ్దుల్‌ అజీమ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-26T05:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising