ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధికి ఆమడ దూరంలో అంజన్న సన్నిధి

ABN, First Publish Date - 2022-05-20T05:55:09+05:30

కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న సన్నిఽధి అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని పాలకులు, ప్రభుత్వాలు మారుతున్న అంజన్న ఆలయ సన్నిధి అభివృద్దికి నోచుకోవడం లేదని కొండగట్టు పరిరక్షణ సమితి అఽధ్యక్షుడు పోల్సాని సుగు ణాకర్‌ రావు ఆరోపించారు.

సమావేశంలో మాట్లాడుతున్న సుగుణాకర్‌ రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండగట్టు పరిరక్షణ సమితి అఽధ్యక్షుడు సుగుణాకర్‌ రావు 

జగిత్యాల అర్బన్‌, మే 19: కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న సన్నిఽధి అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని పాలకులు, ప్రభుత్వాలు మారుతున్న అంజన్న ఆలయ సన్నిధి అభివృద్దికి నోచుకోవడం లేదని కొండగట్టు పరిరక్షణ సమితి అఽధ్యక్షుడు పోల్సాని సుగు ణాకర్‌ రావు ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండగట్టు అంజన్న క్షేత్రం సమస్యలకు నిలయంగా మారిందన్నారు. పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నా అంజన్న సన్నిధి అభివృద్దికి నోచుకోవడంలేదన్నారు. గుట్టపై తాగునీటి కొరత, అపరిశుభ్రత, కోనేటిలో నీటి సమస్యతో పాటు నిర్వహణ లోపాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంతటి నిర్లక్ష్యానికి భక్తులు గురవుతున్నా నేపథ్యంలో అంజన్న పరిరక్షణ సమితి పేరిట ఆధ్యాత్మికంగా ఉద్యమాలు చేస్తున్నామన్నారు. కొండగట్టు ఆలయ పరిసరాలలో 1700 ఎకరాల భూమిని గుట్టలతో కలిపి ఆలయ పరిధిలోకి తేవాలని డిమాండ్‌ చేశారు. కొండగట్టు ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలనేదే తమ ఆలోచన అని, పచ్చటి ప్రకృతి వాతావరణంలో చిన్న, పెద్ద హనుమాన్‌ జయంతి ఉత్సవాలతో పాటు భక్తులకు అన్నివిధాల సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 22న కొండగట్టు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీరామనామ జప, సుదర్శనయాగం చేస్తున్నామన్నారు. ఈ  కార్యక్రమానికి హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పండితులు వస్తున్నారన్నారు. యాదాద్రి, వేములవాడ తరహాలో కొండగట్టు క్షేత్రాన్ని అభివృద్ది చేయాలని కోరారు. ఒక్కరోజు కవిత భజన చేస్తే సరిపోదని అభివృద్దికి అవసరమైన నిధులు కేటాయించి, ఆలయ అభివృద్దికి తోడ్పాటును అందించాలని కోరారు. ఈ సమావేశంలో బొడుగం మోహన్‌రెడ్డి, గంప జగన్‌, వనమాల యాదగిరి, తేలు నరేష్‌, చుక్క ప్రకాష్‌, నరేంద్రుల శ్రీనివాస్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-05-20T05:55:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising