అంబేద్కర్ ఆశయసాధనకు కృషి
ABN, First Publish Date - 2022-12-07T00:30:19+05:30
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేద్దామని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ అన్నారు.
వేములవాడలో అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే రమేష్‌బాబు
వేములవాడ, డిసెంబరు 6: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేద్దామని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం వేములవాడలోని అంబేద్కర్ విగ్రహాని కి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కలలుగన్న భారతావనిని నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T00:30:23+05:30 IST