ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

ABN, First Publish Date - 2022-12-07T00:27:27+05:30

యువత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాల వేస్తున్న మంత్రి గంగుల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుభాష్‌నగర్‌, డిసెంబరు 6: యువత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. మంగళవారం అంబేద్కర్‌ వర్దంతి సందర్భంగా కరీంనగర్‌ కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి ఆత్మగౌరవంతో జీవించాలనే అంబేద్కర్‌ స్పూర్తితో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. నూతన సచివాలయానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం అని పేరు పెట్టుకున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్‌ వై సునీల్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:27:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising