ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికుల సొమ్మును కేటాయించడం సరికాదు

ABN, First Publish Date - 2022-01-24T05:59:48+05:30

సింగరేణి కార్మికుల సొమ్మును రామగుండం మెడికల్‌ కళాశాలకు కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం అనుమతి రాష్ట్ర ప్రభుత్వం నిధుల ద్వారానే మెడికల్‌ కళాశాల నిర్మాణం చేపట్టాలని సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌(బీఎంఎస్‌) అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న యాదగిరి సత్తయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బీఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య

గోదావరిఖని, జనవరి 23: సింగరేణి కార్మికుల సొమ్మును రామగుండం మెడికల్‌ కళాశాలకు కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం అనుమతి రాష్ట్ర ప్రభుత్వం నిధుల ద్వారానే మెడికల్‌ కళాశాల నిర్మాణం చేపట్టాలని సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌(బీఎంఎస్‌) అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక బీఎంఎస్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తూ, నిర్మాణం కోసం రూ.350కోట్లు నిధులు కేటాయించిందని, అయినప్పటికీ కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని, నిధుల మళ్లింపుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. సింగరేణికి వచ్చిన కోట్లాది రూపాయల లాభాలను యాజమాన్యం అప్పనంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధారదత్తం చేస్తుందని, కార్మికులు తీసుకువచ్చిన లాభాలను సింగరేణి యాజమాన్యం కార్మికుల మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయడం లేదని, మెరుగైన వైద్యం అందించడం లేదన్నారు. యాజమాన్యం సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని, కార్పొరేట్‌ కళాశాలల్లో చదువుతున్న కార్మికుల పిల్లలకు ఫీజు రియాంబర్స్‌మెంట్‌ ఇప్పించాలని, జెన్‌కో నుంచి రావాల్సిన రూ.17వేల కోట్లను వెంటనే ప్రభుత్వం సింగరణి యాజమాన్యానికి చెల్లించాలని ప్రభుత్వా న్ని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో బీఎంఎస్‌ నాయకులు పెండ్రం సత్యనారాయణ, సాయవేని సతీష్‌, పల్లె శ్రీనివాస్‌, గుండెబోయిన భీమ య్య, జనగామ రాయలింగు, లక్ష్మయ్య, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T05:59:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising