ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగబద్ధంగా పరిపాలన ఉండాలి

ABN, First Publish Date - 2022-12-14T00:46:01+05:30

కేంద్రంలో, రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన ఉండాలని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఉరుకోబోమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆన్నారు.

మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిగురుమామిడి, డిసెంబరు 13: కేంద్రంలో, రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన ఉండాలని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఉరుకోబోమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ముస్కు రాజిరెడ్డి స్మారక భవనంలో సిపిఐ మండల సర్వసభ్య సమావేశం సీపీఐ జిల్లా నాయకుడు ఎలగందులు రాజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మఖ్యఅతిథిగా చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశ సంపదను కొల్లగొడితే ఉరుకునే ప్రసక్తి లేదన్నారు. నిరంతరం పాలకుల అవినీతి చిట్టాలను వెలికి తీస్తూ ఉద్యమాలు చేయడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. కరోనా సమయంలో కోట్లాది మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి విధిన పడ్డా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అవినీతిపరులు, అక్రమార్కులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని విమర్శించారు. అర్హులైన పేద ప్రజలకు ఇళ్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రజా గొంతుకులైన వరవరరావు, ప్రొఫెసర్‌ సాయాబాబా లాంటి వ్యక్తులను జైళ్లల్లో భందించడం కేంద్ర ప్రభుత్వానికి భావ్యం కాదని, వారిని వెంటనే విడుదల చేసి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. అన్ని గ్రామాల్లో సీపీఐని బలోపేతం చేయాలని, గ్రామాల్లో జరుగుత్ను అవినితి అక్రమాలపై నిరంతరం ప్రజలపక్షానా పోరాటాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చినారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె స్వామి, గూడెం లక్ష్మి, సీపీఐ మండల కార్యదర్శి నాగెళ్లి లక్ష్మారెడ్డి, చాడ శ్రీధర్‌రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బోయిని అశోక్‌, బూడిద సదాశివ, అందె చిన్న స్వామి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-14T00:46:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising