ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలపరిమితి ముగిసిన మందులు విక్రయిస్తే చర్యలు

ABN, First Publish Date - 2022-09-08T06:11:06+05:30

అనుమతి లేని, కాలపరిమితి ముగిసిన మందులు, ఎరువులను రైతులకు విక్రయిస్తే అలాంటి షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి పాక సురేష్‌ కుమార్‌ అన్నారు.

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేస్తున్న డీఏవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఏవో పాక సురేష్‌ కుమార్‌

జగిత్యాల అగ్రికల్చర్‌, సెప్టెంబరు 7: అనుమతి లేని, కాలపరిమితి ముగిసిన మందులు, ఎరువులను రైతులకు విక్రయిస్తే అలాంటి షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి పాక సురేష్‌ కుమార్‌ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు రైతు డిపోలు, ఇతర ఫర్టిలైజర్‌ షాపులను తనిఖీ చేసి, అనుమతి పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ రైతులు ఎరువులను కొనుగోలు చేస్తే విధిగా బిల్లులు పొందాలని సూచించారు. గడువు ముగిసిన ఎరువులు, మందులు విక్రయిస్తే అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నాణ్యత పరీక్షల నిమిత్తం వివిధ రకాల పురుగు మందుల నమూనాలను సేకరించి, పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపించడం జరుగుతుందన్నారు. ఈ తనిఖీల్లో అర్బన్‌ మండల ఏవో వినీల తదితరులున్నారు. 

Updated Date - 2022-09-08T06:11:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising