ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం వహిస్తే చర్యలు
ABN, First Publish Date - 2022-12-16T01:14:53+05:30
ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు అలసత్వం చేయవద్దని కలెక్టర్ గుగులోతు రవి నాయక్ అన్నా రు. గురువారం పట్టణంలోని న్యూ కలెక్టరేట్ కార్యాలయంలో గల సమా వేశ మందిరంలో బ్యాంకర్లతో రుణ లక్ష్యాలకు సంబంధించి సమీక్ష సమా వేశాన్ని నిర్వహించారు.
కలెక్టర్ గుగులోతు రవి నాయక్
జగిత్యాల, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు అలసత్వం చేయవద్దని కలెక్టర్ గుగులోతు రవి నాయక్ అన్నా రు. గురువారం పట్టణంలోని న్యూ కలెక్టరేట్ కార్యాలయంలో గల సమా వేశ మందిరంలో బ్యాంకర్లతో రుణ లక్ష్యాలకు సంబంధించి సమీక్ష సమా వేశాన్ని నిర్వహించారు. రుణ లక్ష్యాలకు సంబంధించిన పుస్తకాలను ఆవి ష్కరించారు. ఈసందర్భంగా కలెక్టర్ రవి నాయక్ మాట్లాడారు. జిల్లా లో ఎస్టీ సబ్ ప్లాన్ కింద పెండింగ్‌లో ఉన్న 18 యూనిట్లు తక్షణమే గ్రౌండ్ చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయ రుణాలకు సంబంధించి ఖరీ ఫ్లో రూ. 1,293 కోట్లు, పంట రుణం రూ. 855 కోట్లు వ్యవసాయ, టర్మ్ రుణాలను మంజూరు చేస్తూ వార్షిక రుణ ప్రణాళిక కింద మొత్తం రూ. 1,497 కోట్ల రుణాల్ని మంజూరు చేశామన్నారు. అదేవిధంగా వ్యాపారు లకు సంబంధించి మొదటి విడతలో 11,294 మందికి, రెండవ విడతలో 3,454 మందికి రుణాలు మంజూరు చేశామన్నారు.
మూడో విడత రుణాలు ఆశాజనకంగా లేవన్నారు. సూక్ష్మ, చిన్న, మ ద్యతరహా రుణాల కింద రూ. 132 కోట్లు, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 114 మందికి మంజూరు చేశామన్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్వశక్తి సంఘాలకు రూ. 296 కోట్లు, పట్టణ ప్రాంత సంఘాలకు రూ. 30 కోట్లు అందిచామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బీఎస్ లత, మంద మకరందు, లీడ్ బ్యాంక్ మేనేజరు పొన్న వెంకటరెడ్డి, వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు, ప్రభుత్వ శా ఖల అధికారులు పాల్గొన్నారు.
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి
జిల్లాలో ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చే యాల్సిన అవసరముందని కలెక్టర్ గుగులోతు రవి నాయక్ అన్నారు. గు రువారం పట్టణంలోని న్యూ కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లాలోని వి విధ శాఖలకు చెందిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష ని ర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ లక్ష్యం మే రకు మన ఊరు మన బడి కార్యక్రమం పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మంద మకరం దు, జిల్లా విద్యాశాఖాధికారి జగన్ మోహన్‌రెడ్డి, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T01:15:04+05:30 IST