చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు
ABN, First Publish Date - 2022-12-16T23:56:26+05:30
చట్ట వ్యతి రేక కార్యకలాపాలకు పాల్పడితే చర్య లు తీసుకుంటామని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి అన్నారు.
ధర్మారం, డిసెంబరు 16: చట్ట వ్యతి రేక కార్యకలాపాలకు పాల్పడితే చర్య లు తీసుకుంటామని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి అన్నారు. శుక్రవారం ధ ర్మారం మండలం దొంగతుర్తి గ్రామం లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్ద ని ఆయన చెప్పారు. చట్ట వ్యతిరేక ప నులు చేసి కేసులు నమోదైతే ఎలాం టి ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నా రు. నేరాలపై యువత జాగ్రత్త పడాల ని ఆయన సూచించారు. శాంతిభద్రతల పరిరణకు గ్రామా ల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహిస్తు న్నట్టు ఆయన తెలిపారు. గ్రామాల్లో ఎవరైన అనుమానాస్ప దంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత బ్యాంకు ఖాతా, ఏటీఎం ఓటీపీ వివ రాలను చెప్పవద్దని ఆయన వివరించారు. ఈ సందర్భంగా గ్రామంలో ధర్మారం-పెద్దపల్లి రహదారిలో వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. 20 వాహానాలను సీజ్ చేశారు. వాహన ధ్రువ పత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐలు ప్రదీప్‌కుమార్, సీఐ ఇంద్రాసేనారెడ్డి, పెద్దపల్లి ట్రా ఫిక్ ఇన్‌స్పెక్టర్ అనిల్‌కుమార్, ధర్మారం, జూలపల్లి, పెద్దప ల్లి, బసంత్‌నగర్ ఎస్సైలు శ్రీనివాస్, అశ్విని, వెంకటకృష్ణ, రా జేష్, మౌనిక, శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T23:56:31+05:30 IST