కోరుట్లలో అక్రమ లేఅవుట్లపై చర్యలు
ABN, First Publish Date - 2022-12-15T00:20:43+05:30
పట్టణంలోని ఏసుకోని గుట్ట ప్రాతంలోని సర్వే నంబర్ 1297లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్ హద్దు రాళ్లను బుధవారం మున్సిపల్ అధికారులు తొలగిం చారు.
కోరుట్ల, డిసెంబరు 14 : పట్టణంలోని ఏసుకోని గుట్ట ప్రాతంలోని సర్వే నంబర్ 1297లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్ హద్దు రాళ్లను బుధవారం మున్సిపల్ అధికారులు తొలగిం చారు. మున్సిపల్ కమిషనర్ అయాజ్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్‌రావు పర్యవేక్షణలో టీపీఎస్ రమ్య సిబ్బందితో కలిసి హద్దురాళ్లను తొలగించారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ అయాజ్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్‌రావు మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లపై మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.
Updated Date - 2022-12-15T00:21:22+05:30 IST