ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలి

ABN, First Publish Date - 2022-08-05T05:18:06+05:30

A triple flag should be hoisted on every house

సమావేశంలో మాట్లాడుతున్న ప్రతాప రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ

వేములవాడ, ఆగస్టు 4: స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. గురువారం వేములవాడలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్‌ కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలోని కనీసం 30 కుటుంబాలకు జాతీయ పతాకాన్ని అందిస్తామని, ప్రతి మండల కేంద్రంలో తిరంగా బైక్‌ ర్యాలీ నిర్వహిస్తామని, మహనీయుల విగ్రహాలను శుభ్రం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్‌ బాధ్యులు శీలం రాజు, రాకేశ్‌, బీజేపీ నాయకులు రేగుల మల్లికార్జున్‌, రేగుల సంతోష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-05T05:18:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising