ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పునాస పంటల సర్వే

ABN, First Publish Date - 2022-08-05T05:22:04+05:30

భారీ వర్షాలు, వరదలతో ఖరీఫ్‌ సాగు ఆలస్యంగా మారింది.

క్రాప్‌ బుకింగ్‌ను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారుల వివరాల సేకరణ

- ప్రత్యేక వెబ్‌సైట్‌లో ఫొటోలతో సహా అప్‌లోడ్‌ 

- సర్వే నంబర్ల ప్రకారం జియో ట్యాగింగ్‌ 

- 19,140 ఎకరాల్లో క్రాప్‌ బుకింగ్‌ పూర్తి 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

భారీ వర్షాలు, వరదలతో ఖరీఫ్‌ సాగు ఆలస్యంగా మారింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జిల్లా వ్యాప్తంగా వరినాట్ల జోరు పెరిగింది. ఇదే క్రమంలో జిల్లా వ్యాప్తంగా వానాకాలం సాగుపై వ్యవసాయ అధికారులు క్రాప్‌ బుకింగ్‌ సర్వేను ప్రారంభించారు. జిల్లాలో ఈసారి 2.44 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసే లక్ష్యంగా వ్యవసాయ శాఖ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. ఇప్పటి వరకు 1.67 లక్షల ఎకరాల్లో పంటల సాగు పూర్తి చేశారు. ఇప్పటి వరకు వరి 1,02,240 ఎకరాల్లో, పత్తి 62,983 ఎకరాలు, మొక్కజొన్న 749 ఎకరాలు, కందులు 1,210 ఎకరాలు, పెసర 52 ఎకరాల్లో సాగు చేశారు. పంటల సాగుకు అనుగుణంగానే క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు సర్వేను ప్రారంభించారు. 

- సర్వే నంబర్ల ప్రకారం క్రాప్‌ బుకింగ్‌ 

జిల్లా వ్యాప్తంగా భూమి సర్వే నంబర్ల ప్రకారం పంటలను పరిశీలించి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. జియో ట్యాగింగ్‌ కూడా చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,67,234 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా సిరిసిల్లలో 4,393 ఎకరాలు, తంగళ్లపల్లిలో 12,205 ఎకరాలు, గంభీరావుపేటలో 9,137 ఎకరాలు, ముస్తాబాద్‌లో 12,893 ఎకరాలు, వీర్నపల్లిలో 2,687 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 17,280 ఎకరాలు, ఇల్లంతకుంటలో 27,730 ఎకరాలు, బోయినపల్లిలో 16,102 ఎకరాలు, చందుర్తిలో 15,117 ఎకరాలు, కోనరావుపేటలో 20,290 ఎకరాలు, రుద్రంగిలో 7,632 ఎకరాలు, వేములవాడలో 9,072 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 12,696 ఎకరాల్లో సాగు చేశారు. దీనికి సంబంధించిన క్రాప్‌ బుకింగ్‌లో 19,140 ఎకరాలను సర్వే చేసి ఆన్‌లైన్‌ చేశారు. వరి 6,270 ఎకరాలు, పత్తి 8,962 ఎకరాలు, కందులు 161 ఎకరాలు, మొక్కజొన్న 154 ఎకరాల్లో సర్వే జరిగింది. వ్యవసాయ అధికారులు సర్వేను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సాగులో వరి నాట్లు సిరిసిల్లలో 2,550 ఎకరాలు, తంగళ్లపల్లిలో 11,000 ఎకరాలు, గంభీరావుపేటలో 8,540 ఎకరాలు, ముస్తాబాద్‌లో 11,500 ఎకరాలు, వీర్నపల్లిలో 2,100 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 12,550 ఎకరాలు, ఇల్లంతకుంటలో 12,400 ఎకరాలు, బోయినపల్లిలో 7,800 ఎకరాలు, చందుర్తిలో 7,200 ఎకరాలు, కోనరావుపేటలో 12,200 ఎకరాలు, రుద్రంగిలో 3,300 ఎకరాలు, వేములవాడలో 3,200 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 7,900 ఎకరాల్లో సాగు చేశారు. పత్తి సాగును సిరిసిల్లలో 1,815 ఎకరాలు, తంగళ్లపల్లిలో 1,020 ఎకరాలు, గంభీరావుపేటలో 528 ఎకరాలు, ముస్తాబాద్‌లో 1,030 ఎకరాలు, వీర్నపల్లిలో 580 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 4,690 ఎకరాలు, ఇల్లంతకుంటలో 15,010 ఎకరాలు, బోయినపల్లిలో 8,000 ఎకరాలు, చందుర్తిలో 7,800 ఎకరాలు, కోనరావుపేటలో 7,900 ఎకరాలు, రుద్రంగిలో 4,200 ఎకరాలు, వేములవాడలో 5,700 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 4,710 ఎకరాల్లో సాగు చేశారు. దీనికి సంబంధించి పంట విస్తీర్ణం సర్వే నంబర్లు, రైతు వివరాలు, క్షేత్రస్థాయిలో పరిశీలించి జియో ట్యాగింగ్‌ చేస్తూ ఫొటోలతో అప్‌లోడ్‌ చేస్తున్నారు. దీంతో సాగుకు సంబంధించిన కచ్చితమైన సమాచారం ప్రభుత్వానికి అందుతుంది. 



Updated Date - 2022-08-05T05:22:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising