ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఎస్‌టీపీపీలో కీలక ఘట్టం విజయవంతం

ABN, First Publish Date - 2022-09-02T05:23:14+05:30

ఎన్టీపీసీ ఆధ్వర్యంలో తెలంగాణ సూ పర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(టిఎస్‌టిపిపి) నిర్మాణంలో కీలక ఘట్టం అమలులో ముందడుగు పడింది.

టీఎస్‌టీపీపీ అధికారులను అభినందిస్తున్న సీజీఎం సునీల్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బాయిలర్‌ స్టీం బ్లోయింగ్‌ పరీక్ష సక్సెస్‌  

జ్యోతినగర్‌, సెప్టెంబరు 1 : ఎన్టీపీసీ ఆధ్వర్యంలో తెలంగాణ సూ పర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(టిఎస్‌టిపిపి) నిర్మాణంలో కీలక ఘట్టం  అమలులో ముందడుగు పడింది. టీఎస్‌టీపీపీలోని స్టేజ్‌ 1లో 800 మెగావాట్ల సామర్థ్యంగల రెండు యూనిట్లను(1600 మెగావాట్లు)  నెలకొల్పుతున్నారు. 1వ యూనిట్‌లోని బాయిలర్‌కు సంబంధించి బాయిలర్‌ నుంచి టర్బయిన్‌కు ప్రధాన స్టీంతోపాటు కోల్డ్‌ రీ హీట్‌ స్టీం వెళ్లే ప్రక్రియలో భాగంగా బుధవారం రాత్రి స్టీం బ్లోయింగ్‌ ను విజయవంతంగా పరీక్షించారు. సుమారు 4 నిమిషాల పాటు ఎంఎస్‌ (మెయిన్‌ స్టీం), కోల్డ్‌ రీ హీట్‌ స్టీం(సీఆర్‌హెచ్‌)లను విడుదల చేసే (కంబైన్డ్‌ బ్లోయింగ్‌) ప్రక్రియను పరీక్షించారు. ప్రతి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో(బొగ్గు ఆధారిత) బాయిలర్‌, టర్బయిన్‌, జనరేటర్లు అత్యం త కీలకమైన విభాగాలుగా భావిస్తారు. దీనిలో బాయిలర్‌లో విడుదల అయ్యే స్టీంను ఎకనొమైజర్‌ ద్వారా సూపర్‌ హీటెడ్‌ సీంగా మార్చి టర్బయిన్‌కు, తిరిగి ఆ స్టీంను వినియోగిస్తారు. ఈ విషయంలో కంబైన్డ్‌ ఎంఎస్‌ అండ్‌ సీఆర్‌హెచ్‌ను పంపించే దశను విజయవతంగా నిర్వహించారు. కీలక దశలో పరో ముదడుగు పడడంతో మరో మూడు, నాలుగు నెలల్లో టీఎస్‌టీపీపీలో మిగతా టర్బయిన్‌, జపరేటర్‌ విభాగాల్లో పరీక్షలు పూర్తి చేసి 1వ యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది.

టీఎస్‌టీపీలో పూర్తయిన కీలక దశలు..

టీఎస్‌టీపీపీలో ఇప్పటి వరకు వివిధ కీలక దశలను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రాజెక్టులోని 800 మెగావాట్ల 2వ యూనిట్‌ నాన్‌ డ్రైన బుల్‌ హైడ్రో పరీక్షను చేసి బాయిలర్‌ను లైట్‌అప్‌ చేశారు. యాష్‌ హ్యాడ్లింగ్‌ విభాగంలోని ట్రాన్స్‌ఫార్మలర్ల చార్జింగ్‌, పంపుల ట్రయల్‌ రన్‌ ను మెజారిటీ పైపులైన్లతో పాటు స్లర్రీ పైప్‌లైన్ల నిర్మాణం పూర్తి చేశారు. అలాగే సీహెచ్‌పీలో రీక్లైమర్‌ పాత్‌, కన్వేయర్లను పూర్తి చేశారు. వాటర్‌ సిస్టం, జీఐఎస్‌ సిస్టంల నిర్మాణాలను పూర్తి చేశారు. తాజాగా ఎంఎస్‌ అండ్‌ సీఆర్‌హెచ్‌ ప్రక్రియను సక్సెస్‌ చేశారు. ఎంఎస్‌, సీహెచ్‌ఆర్‌ను విజయవంతం చేయడంలో కృషి చేసిన ఎన్టీపీసీ అధికారులను ప్రాజెక్టు సీజీఎం సునీల్‌ కుమార్‌ అభినందించారు. 

Updated Date - 2022-09-02T05:23:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising