Karimnagar: మహిళ దారుణ హత్య
ABN, First Publish Date - 2022-10-07T14:52:30+05:30
తిమ్మాపూర్ మండలంలో దారుణ హత్య జరిగింది. రామకృష్ణకాలనీలో ఇద్దరు మహిళలపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. దాడిలో గుజ్జుల
కరీంనగర్: తిమ్మాపూర్ మండలంలో దారుణ హత్య జరిగింది. రామకృష్ణకాలనీలో ఇద్దరు మహిళలపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. దాడిలో గుజ్జుల సులోచన అనే మహళ దుండగుల దాడిలో అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో మహిళ తల్లి బాలవ్వకు తీవ్రగాయాలు కావడంతో హుటాహుటిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-10-07T14:52:30+05:30 IST