ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kapu reservation: ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది

ABN, First Publish Date - 2022-12-22T03:31:55+05:30

ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వారికి (ఈడబ్ల్యూఎస్‌) కేంద్రం కల్పించిన 10 శాతం కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ ఇస్తూ ఏపీలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సూచనప్రాయంగా సమర్థించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీలో కాపు రిజర్వేషన్లపై ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర మంత్రి వివరణ

కోటా కుదరదని గతంలో అసెంబ్లీలో చెప్పిన జగన్‌

కాపులకు 5ు టీడీపీ సర్కార్‌ కేటాయింపు

విద్యా, ఉద్యోగాల్లో ఆ సామాజికవర్గానికి ఊతం

అధికారంలోకి రాగానే కోటా రద్దు చేసిన జగన్‌

అమరావతి, న్యూఢిల్లీ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వారికి (ఈడబ్ల్యూఎస్‌) కేంద్రం కల్పించిన 10 శాతం కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ ఇస్తూ ఏపీలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సూచనప్రాయంగా సమర్థించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2019 యాక్ట్‌ ద్వారా కాపులకు ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 5ు రిజర్వేషన్‌ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం చట్టపరంగా అనుమతించదగిందేనా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యలో కాపులకు బీసీ రిజర్వేషన్‌ ఇవ్వాలంటే ఏపీ ప్రభుత్వం అనుసరించాల్సిన విధానం ఏమిటి? అని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు.. కేంద్ర మంత్రి ప్రతిమ భౌమిక్‌ సమాధానమిచ్చారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చట్టం చేసినట్టు చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఎస్‌ఈబీసీలకు) రిజర్వేషన్‌ ఇచ్చే అధికారం, ఇందుకు అవసరమైన ప్రత్యేక జాబితా రూపొందించుకునే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు.

ఏపీలో కాపులకు రిజర్వేషన్ల పట్ల జగన్‌ మొదటి నుంచీ వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు కూడా పలు సమావేశాల్లో కాపులకు రిజర్వేషన్లు తమ పరిధిలో లేవని, దానిపై తాను హామీ ఇవ్వలేనని ఖరాకండిగా చెప్పారు. అంతేకాకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను రాష్ట్రంలో విద్యాపరంగా మాత్రమే వర్తింపజేస్తూ చట్టం చేశారు. ఉద్యోగ రిజర్వేషన్లకు సంబంధించి ఈడబ్ల్యూఎ్‌సపై నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అగ్రవర్ణ పేదలు తీవ్రంగా నష్టపోయారు.

Updated Date - 2022-12-22T03:31:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising