ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలో ఎక్కడా లేదు... నిర్మించలేదు: మంత్రి హరీష్‌‌రావు

ABN, First Publish Date - 2022-04-29T19:36:21+05:30

డబుల్ బెడ్ రూంల నిర్మాణంపై విమర్శలు చేసే పార్టీలు బాన్సువాడ నియోజకవర్గాన్ని చూడాలని మంత్రి హరీష్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: డబుల్ బెడ్ రూంల నిర్మాణంపై విమర్శలు చేసే పార్టీలు బాన్సువాడ నియోజకవర్గాన్ని చూడాలని మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యమేనా అని మాట్లాడిన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏం సమాదానం చెప్తారని ప్రశ్నించారు. ‘‘ఇంత పెద్ద ప్రాజెక్టు దేశంలో ఎక్కడా లేదు... నిర్మించలేదు... ఇది ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనం’’ అని తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ హాయాంలో నిజాంసాగర్ ఎండిపోయింది నిజంకాదా అని అడిగారు. రైతులకు సాగు, ప్రజలకు తాగునీరు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ దే అని చెప్పుకొచ్చారు. అవరసం ఉన్నా లేకున్నా సిజేరీయన్‌లు చేస్తున్నారని,  ఇందుకు కుటుంబసభ్యులే సహాకరిస్తున్నారని, ఇది మంచి పరిణామం కాదన్నారు. తొందరపడి సిజేరీయన్‌లను ప్రోత్సహించవద్దని సూచనలు చేశారు. ఆశావర్కర్, వైద్యాధికారులు నార్మల్ డెలివరీ చేసుకునేలా కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. బాన్సువాడ ఆసుపత్రిలో నూతన డాక్టర్లను మంజూరు చేస్తామని, నూతన పోస్టుమార్టం రూమ్ నిర్మాణం చేస్తామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-29T19:36:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising