కాళేశ్వరం కేసీఆర్ కమీషన్ల ప్రాజెక్టు: షర్మిల
ABN, First Publish Date - 2022-08-04T09:33:21+05:30
‘కాళేశ్వరం ప్రజల ప్రాజెక్టు కాదు.
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ‘కాళేశ్వరం ప్రజల ప్రాజెక్టు కాదు. కేసీఆర్ కమీషన్ల ప్రాజెక్టు. ప్రజాధనం దోచుకోవడానికి కట్టిన ప్రాజెక్టు’ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. బుధవారం జలసౌధ ముందు ఆమె ధర్నా నిర్వహించారు. పనుల్లో నాణ్యత లేకపో వడం వల్లనే కాళేశ్వరం పంప్‌హౌస్‌లు మునిగిపోయాయని ఆరోపించారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకపోగా.. అధికారులు ఎందుకు సమర్థిస్తున్నారని నిలదీశారు. ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరిపించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ(జనరల్) మురళీధర్‌కు వినతిపత్రం సమర్పించారు.
Updated Date - 2022-08-04T09:33:21+05:30 IST