ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: కేఏ పాల్, రాజగోపాల్ ఇద్దరూ ఇద్దరే: రాంరెడ్డి దామోదర్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-08-06T20:29:12+05:30

ఏపీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul), తెలంగాణలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏపీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul), తెలంగాణలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (MLA Komati Reddy Rajagopal Reddy) ఇద్దరూ ఇద్దరేనని, ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (Ram Reddy Damodar Reddy) ఎద్దేవాచేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మండిపడ్డారు. కోమటిరెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు కల్పించిందని గుర్తుచేశారు. కేంద్రమంత్రి అమిత్‌షాను ఇద్దరు ఒకేసారి కలిశారంటే త్వరలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా బీజేపీలో చేరుతారని తెలిపారు. ఎంపీ కోమటిరెడ్డి చండూరు సభకు ఎందుకు హాజరు కాలేదో, అమిత్‌షాతో ఎందుకు భేటీ అయ్యారో చెప్పాలని రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ప్రశ్నించారు. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీకి పనిచేశారని కాంగ్రెస్ నేత మల్లు రవి (Mallu Ravi) దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని తెలిపారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని మల్లు రవి ప్రకటించారు.

Updated Date - 2022-08-06T20:29:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising