ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసులో కీలక పరిణామం

ABN, First Publish Date - 2022-09-02T22:29:40+05:30

జూబ్లీహిల్స్ (Jubilee Hills) పబ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడిన ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించాలంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) పబ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడిన ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించాలంటూ నాంపల్లి కోర్టు (Nampally Court)లో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఐదుగురికి మెచ్యూరిటీ లెవల్స్‌ ఉన్నాయని, మేజర్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఐదుగురికి ఉన్నాయని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసుల పిటిషన్‌పై త్వరలో కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 28న ఓ పార్టీలో పాల్గొనేందుకు జూబ్లీహిల్స్‌ అమ్నేషియా పబ్‌కు వచ్చిన మైనర్‌ బాలికపై సాదుద్దీన్‌ అనే యువకుడితో పాటు నలుగురు మైనర్లు సామూహిక అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. మరో మైనర్‌ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు రిమాండ్‌ రిపోర్టు (Remand Report)లో పేర్కొన్నారు. నిందితుల్లో చాలా మందికి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండటంతో కేసు సంచలనంగా మారింది. నలుగురు మైనర్లు కావడంతో.. పోలీసులు ముందు నుంచి సాదుద్దీన్‌నే ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. మిగతా మైనర్‌ నిందితుల్లో ఓ ప్రభుత్వ శాఖలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి కుమారుడు, సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడితో పాటు మరో ఇద్దరు వ్యాపారవేత్తల కుమారులున్నారు.


వీవీఐపీల పిల్లలు నిందితులుగా ఉండడం.. ఈ ఘటనపై విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. మైనర్లకు కూడా పెద్ద శిక్షలు పడేలా పకడ్బందీగా సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. అయితే.. ఘటనపై అవగాన ఉండి.. ఆ సమయంలో పబ్‌, బేకరీల వద్ద ఉన్న వారు సాక్ష్యం చెప్పేందుకు వెనుకంజ వేస్తున్నారని పోలీసులు తెలిపారు. రిమాండ్‌ రిపోర్టులో ఇప్పటికే 12 మంది సాక్షులను విచారించినట్లు పేర్కొన్న పోలీసులు .. వారి పేర్లను, వివరాలను కోర్టుకు అందజేశారు. వారిలో బాలిక తల్లిదండ్రులు, సోదరుడు, బాలికను పబ్‌కు తీసుకెళ్లిన వ్యక్తి, పబ్‌ నిర్వాహకుల్లో ఇద్దరు, ఓ బౌన్సర్‌, ఓ కాపలాదారు, బేకరీలో పనిచేసే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. కేసుకు మరింత బలం చేకూరేలా పబ్‌లో సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన వారు.. నిందితులతో సన్నిహితంగా మెలిగినవారిని కూడా సాక్ష్యులుగా చేర్చాలని పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బాలికపై అత్యాచారానికి ఉపయోగించిన ఇన్నోవా వాహనంలో లభించిన తల వెంట్రుకలను పోలీసులు సేకరించారు. అత్యాచారం జరిపాక.. నిందితులు మరకలను టిష్యూ పేపర్లతో తుడుచుకున్నారని పోలీసులు తెలిపారు. కారులో వీర్యం తాలూకు ఆధారాలు కూడా లభించాయని, వేలిముద్రలను సేకరించామని చెబుతున్నారు. 

Updated Date - 2022-09-02T22:29:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising