ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్ ఆర్భాటం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది.. నిరుద్యోగ భృతి ఏమైంది?: జీవన్ రెడ్డి

ABN, First Publish Date - 2022-03-09T19:28:16+05:30

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆర్భాటం చూస్తే ఆశ్చర్యం వేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆర్భాటం చూస్తే ఆశ్చర్యం వేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ  బిస్వాల్ కమిటీ లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు చెప్పిందన్నారు. ముఖ్యమంత్రి క్యాలండర్ ఏడాది వెనకబడిందన్నారు. నిరుద్యోగులను ఆత్మహత్యలకు నెట్టి ఇవాళ ఆర్భాటం చేస్తున్నారని విమర్శించారు. అదనపు జిల్లాలతో అదనపు ఉద్యోగాలు ఎందుకు క్రియేట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్న ఖాళీలు, రిటైర్‌మెంట్‌తో ఏర్పడ్డ ఖాళీల భర్తీకి ఇంత హంగామా అవసరమా? అన్నారు. కేవలం 13 వేల ఉపాధ్యాయ ఖాళీలకు ఇంత ఆర్భాటమా?.. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. స్థానికత పట్ల చిత్తుశుద్ధి ఉంటే ప్రైవేట్‌లో కూడా స్థానికులకే అవకాశం దక్కేలా చూడాలన్నారు. 80 వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణీత కాల వ్యవధి ప్రకటించాలన్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించిన దుర్మార్గుడు కేసీఆర్ అని, కనీసం టెట్ కూడా ప్రభుత్వం నిర్వహించలేదని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు.

Updated Date - 2022-03-09T19:28:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising