ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్య కుట్ర కేసును ఛేదించిన పోలీసులు

ABN, First Publish Date - 2022-08-09T00:03:31+05:30

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (MLA Jeevan Reddy) హత్య కుట్ర కేసును పోలీసులు ఛేధించారు. నిందితుడు ప్రసాద్‌గౌడ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (MLA Jeevan Reddy) హత్య కుట్ర కేసును పోలీసులు ఛేధించారు. నిందితుడు ప్రసాద్‌గౌడ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 2 వెపన్స్‌, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మక్లూర్‌ మండలం కల్లెడ సర్పంచ్‌ లావణ్యపై అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు సస్పెండ్ చేశారు. తన భార్యను సస్పెండ్ చేశారన్న కక్షతోనే ఎమ్మెల్యే హత్యకు సర్పంచ్ భర్త ప్రసాద్‌గౌడ్ కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల బంజారాహిల్స్‌ (Banjara Hills) రోడ్డు నంబరు 12లోని జీవన్‌రెడ్డి నివాసానికి ప్రసాద్‌గౌడ్‌ వెళ్లాడు. నేరుగా జీవన్‌రెడ్డి పడకగదిలోకి వెళ్లారు. అక్కడ తన జేబులో ఉన్న పిస్తోలు తీసి జీవన్‌రెడ్డి నుదుటికి గురిపెట్టారు. తనకు న్యాయం చేయాలని, లేదంటే చంపేస్తానని ఆయన్ను బెదిరించారు. షాక్‌లోంచి తేరుకున్న జీవన్‌రెడ్డి గట్టిగా అరవడంతో వంటమనిషి గంగాధర్‌ మిగతా సిబ్బంది అక్కడికి వచ్చి ప్రసాద్‌గౌడ్‌ను వెనుక నుంచి పట్టుకున్నారు. అతడి జేబులో కత్తి కూడా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సిబ్బంది, బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జీవన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు ప్రసాద్‌గౌడ్‌పై హత్యాయత్నం, అక్రమ చొరబాటు, ఆయుధాల వాడకం, బెదిరింపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గతంలో మావోయిస్టు సానుభూతిపరుడిగా ప్రసాద్‌ ఉన్నట్లు చెబుతున్నారు. 

Updated Date - 2022-08-09T00:03:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising