జనవరి 24 నుంచి జేఈఈ మెయిన్
ABN, First Publish Date - 2022-12-16T02:26:59+05:30
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు జనవరి 24- 31 తేదీల్లో జరగనున్నాయి. ఈ మధ్యలో జనవరి 26, గణతంత్ర దినోత్సవం నాడు పరీక్ష ఉండదు. 2023-24 విద్యా
12 వరకు దరఖాస్తుల స్వీకరణ
సెషన్-1 షెడ్యూల్ ప్రకటించిన జాతీయ పరీక్షా సంస్థ
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు జనవరి 24- 31 తేదీల్లో జరగనున్నాయి. ఈ మధ్యలో జనవరి 26, గణతంత్ర దినోత్సవం నాడు పరీక్ష ఉండదు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం విడుదల చేసింది. దీని ప్రకారం జేఈఈ మెయిన్ సెషన్-1 కోసం డిసెంబరు 15 నుంచి జనవరి 12వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 24వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఆంగ్లం, తెలుగు, హిందీ, ఉర్దూ సహా మొత్తం 13 భాషల్లో ప్రశ్నపత్రాలను సిద్ధం చేస్తున్నారు. కాగా, జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఏప్రిల్‌లో ఉంటాయని ఎన్‌టీఏ ప్రకటించింది.
Updated Date - 2022-12-16T02:27:00+05:30 IST