ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పం: జగదీష్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-06-02T03:16:57+05:30

ప్రతి రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ అహర్నిశలు శ్రమించేది రైతుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రతి రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ అహర్నిశలు శ్రమించేది రైతుల కోసమేనని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు  లాభదాయక పంటల వైపు దృష్టి సారించాలని కోరారు. 2014 సంవత్సరానికి ముందు ఏ పరిస్థితుల్లో ఉన్నామో మననం చేసుకోవాలన్నారు. విద్యుత్తు, నీళ్లు, పెట్టుబడి సాయం అందించిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. 2018 తర్వాత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 24గంటల విద్యుత్తు సరఫరా చేస్తుంటే, కాసేపైనా విరామం ప్రకటించాలని రైతులు విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఈ ఘటనతో విద్యుత్‌ రంగంలో ఎలాంటి అద్భుతాలు సృష్టించామో అర్థమవుతుందని  జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-06-02T03:16:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising