ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో ముసురు, చలి!

ABN, First Publish Date - 2022-12-12T04:14:33+05:30

గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలు చలితో వణికిపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, హైదారబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం, సాయంత్రాల్లో బయటకు రా వాలంటేనే జంకుతున్నారు. తలుపులు, కిటికీలు బిగించేసుకొని ఇంట్లో ఉన్నా చలి వణికిస్తోంది. శీతలగాలులకు తోడు నగరమంతా ముసురు పట్టడంతో పిల్లలు, వృద్ధు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాండౌస్‌ తుఫా ను ప్రభావంతో హైదరాబాద్‌ పరిధిలో ఒక్కసారిగా వా తావరణం మారిపోయింది. శనివారం ఉదయం నుంచి ఆకాశంలో మబ్బులు కమ్ముకొని ఉండటంతో పట్టపగలు కూడా సంధ్యా సమయాన్ని తలపిస్తోంది. నగరంలో పలుచోట్ల శనివారం రాత్రి 11 గంటలకు మొదలైన జ ల్లులు, ఆదివారం 7:30 గంటల దాకా కురిశాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, ట్యాంక్‌బండ్‌, హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, నాంపల్లి, మెహిదీపట్నం, లంగర్‌హౌజ్‌, సన్‌సిటీ, బండ్లగూడ, హయత్‌నగర్‌, సరూర్‌నగర్‌, ఉప్పల్‌, తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు, మోస్తరు వర్షం కురిసింది. హస్తినాపురంలో 5.3 మి.మీ, బండ్లగూడలో 4.8 మి.మీ వర్షపాతం నమోదైం ది. వర్షంతో ద్విచక్రవాహదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆదివారం కావడం.. చల్లి, వర్షం తోడవ్వడంతో రోడ్లపైకి వాహనదారులు రాలేదు. ఫలితంగా హైదరాబాద్‌లో 80శాతం ట్రాఫిక్‌ తగ్గింది. కాగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Updated Date - 2022-12-12T04:14:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising