ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో టీడీపీని టార్గెట్ చేసిన కేసీఆర్

ABN, First Publish Date - 2022-10-04T00:13:18+05:30

సీఎం కేసీఆర్ ఏపీలో టీడీపీని టార్గెట్ చేశారా?.. జాతీయ పార్టీ పెట్టాక ఏపీలో టీడీపీ నేతలను తనవైపు తిప్పుకోవాలనుకుంటున్నారా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం కేసీఆర్ ఏపీలో టీడీపీని టార్గెట్ చేశారా?.. జాతీయ పార్టీ పెట్టాక ఏపీలో టీడీపీ నేతలను తనవైపు తిప్పుకోవాలనుకుంటున్నారా? అంటే ఔననే వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కొత్త పార్టీ కోసం ఏపీ టీడీపీ నేతలకు కేసీఆర్‌ గాలం వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో తనతో కలిసి పనిచేసిన పలువురు నేతలకు కేసీఆర్ నుంచి పిలుపువచ్చినట్లు చెబుతున్నారు. ఏపీలో కొప్పుల, వెలమ సామాజికవర్గం నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తన కొత్త పార్టీలో చేరాల్సిందిగా కేసీఆర్ ఆహ్వానాలు పంపారని ప్రచారం జరుగుతోంది. రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలతో కేసీఆర్‌ మంతనాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌తో కేసీఆర్‌ భేటీ అయ్యారు. కేసీఆర్ వ్యూహం చూస్తుంటే.. ఏపీ సర్కార్‌పై హరీష్‌రావు వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమేనని అనుమానం కలుగుతోంది. కేసీఆర్ జాతీయ పార్టీ లాంఛనమే. ఇప్పటికే పార్టీ పేరు-ఎజెండాపై క్లారిటీకి వచ్చారు. తెలంగాణకే పరిమితమైన టీఆర్‌ఎస్ దసరా తర్వాత జాతీయ పార్టీగా అవతరించబోతోంది. 


జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..

ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు రాబట్టుకోవాలి. దీనితోపాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా గెలవాలి. కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలనే నిబంధన ఉంది. గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకోవాలి. ఆ గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికై ఉండాలి. అందువల్ల పక్క రాష్ట్రాలైనా ఏపీ, కర్నాటకపై కేసీఆర్ దృష్టి సారించినట్లు చెబుతున్నారు. 


ప్రత్యేకంగా ఏపీపై కేసీఆర్ ఫోకస్ పెట్టారని చెబుతున్నారు. ఏపీలో కూడా కేసీఆర్‌కు ఓట్లు పడుతాయనే ధీమాతో ఉన్నారు. గతంలో కేసీఆర్, టీడీపీలో ఉన్నప్పుడు ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరగుతోంది. ఆ మధ్య ఆయన ఏపీలో పర్యటించినప్పుడు విశాఖలో కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కట్టారు. అలాగే కేసీఆర్ సామాజికవర్గం ఉత్తరాంధ్రలో బలంగా ఉంది. కుల సమీకరణలు కలిసివచ్చే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే కొందరు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. అభిమానం ఉన్నంత మాత్రమే ఓట్లు పడవని హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2022-10-04T00:13:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising